Begin typing your search above and press return to search.

సర్వే రిపోర్ట్స్:బాబు ప్రభుత్వంపై రైతులు ఏమనుకుంటున్నారు?

By:  Tupaki Desk   |   11 Jun 2017 5:31 AM GMT
సర్వే రిపోర్ట్స్:బాబు ప్రభుత్వంపై రైతులు ఏమనుకుంటున్నారు?
X
ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమో తన పాలనలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని చెప్పుకొంటూ ఉంటున్నాడు. అందరికీ అన్నీ చేస్తున్నాను అని బాబుగారు తన అనుకూల మీడియా ద్వారా చెప్పిందే చెప్పుకొంటూ గడిపేస్తున్నారు. పునరంకిత దీక్ష అంటూ వారం రోజుల పాటు ఇదే హడావుడి చేశారు. మరి బాబుగారి మాటల సంగతిలా ఉంటే.. వాస్తవం మాత్రం మరో రకంగా ఉందనే మాట వినిపిస్తోంది. ఏపీలో పరిస్థితులపై జరిగిన వివిధ సర్వేలు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన అసహనం ఉందనే మాటను వినిపింపజేస్తున్నాయి.

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ సర్వే సంచలనం రేపుతుండగా.. బాబు పాలనపై రైతులు ఏమనుకుంటున్నారనే అంశంపై జరిగిన ఒక ప్రైవేట్ సర్వే మరింత ఆసక్తికరంగా ఉంది. సమాజంలోని వివిధ వర్గాల నుంచి బాబు ప్రభుత్వ పాలనపై ఫీడ్ బ్యాక్ ను తీసుకుని సాగింది ఈ అధ్యయనం. దీనిప్రకారం.. రైతుల్లో బాబుగారి పాలనపై ఫీడ్ బ్యాక్ ను గమనిస్తే.. తీవ్రమైన అసహనం ఉందనే అంశం స్పష్టం అవుతోంది. ఏకంగా 68 శాతం మంది రైతులు బాబు పాలన పై అసహనంతో ఉన్నట్టుగా ఈ సర్వే తేల్చింది.

ఒకవైపు వ్యవసాయాధారులను ఉద్ధరించేశానని.. రెయిన్ గన్స్ తో కరువును పారద్రోలానని బాబుగారు చెప్పుకొంటూ ఉన్నారు. అలాగే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశానని కూడా ఒకటికి వంద సార్లు చెప్పుకొంటూ ఉన్నారు. మరి అయినప్పటికి 68 శాతం రైతుల్లో అసహనం ఎందుకు అంటే.. బాబుగారు చెప్పుకునేవి ఉత్తుత్తి మాటలు అయినందు వల్ల అని చెప్పాల్సి వస్తుంది.

రైతు రుణమాఫీ ఒక ప్రహసనం. ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులను మాఫీ చేశానని బాబు చెప్పుకొంటూ ఉన్నాడు.. అయితే అందుకు తగ్గ కేటాయింపులు బడ్జెట్ లో జరిగాయా? అంటే.. లేదు. బడ్జెట్ లో కేటాయింపులు జరపకుండానే.. మాఫీ అయిపోయిందని బాబుగారు అంటే నమ్మేదెలా? అలాగే రైతు రుణాలు ఇంకా భారీ స్థాయిలో. చేసిన మాఫీని కూడా విడతలా వారీగా.. రోటికి, గిన్నెకు కాకుండా చేశారు. బాబుగారు ఇస్తున్న రుణమాఫీ మొత్తం కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు.

ఇక రెయిన్ గన్స్ మరో ప్రహసనం. పరిస్థితులు ఇలా ఉంటే.. బాబుగారు మాత్రం అద్భుతాలు జరిగిపోయాయని చెప్పుకుంటున్నారు. వాస్తవదూరంగానే వ్యవహరిస్తున్నారు. గతంలో తొమ్మిదేళ్ల పాలనలోనూ ఇలాగే చేశారు. ఇప్పుడూ అదే జరుగుతోంది.