Begin typing your search above and press return to search.
జగన్ బ్యాచ్ కు మేలు చేసిన ఏపీ బడ్జెట్
By: Tupaki Desk | 10 March 2016 5:30 PM GMTమీరు వింటున్నది నిజమే. తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్టు ఒక రకంగా ప్రతిపక్షనేత జగన్ బ్యాచ్ కు మేలు చేసే విధంగా వుంది. అది ఎలాగంటారా? మీరే తెలుసుకోండి. జగన్ అధికారంలోకి వస్తే... దోనకొండ ప్రాంతం రాష్ట్ర రాజధాని అవుతుందని భావించి...జగన్ బ్యాచ్ అంతా అక్కడ విపరీతంగా భూములు కొనేసింది. బల్లులు కూడా గుడ్లు పెట్టని ప్రాంతం అది. అలాంటి చోట.. చాలా తక్కువ ధరకే భూములు రావడంతో జగన్ తో పాటు.. అతని అనుచరగణం అంతా అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిందనే ప్రచారం వుంది. అయితే జగన్ బ్యాచ్ అనుకున్నదొకటి.. అయింది మరొకటి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో... అమరావతి ప్రాంతం రాజధానికి ఎంపికయింది. దాంతో దొనకొండలో కొన్న భూములన్నీ వృథా అయిపోయాయి.
అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం అక్కడ ఓ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుతో పాటు... సుమారు రూ.23 వేల కోట్లతో పారిశ్రామిక వాడను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. పరిశ్రమల ఏర్పాటుకు ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్టు కేటాయించడంతో.. జగన్ అండ్ కో బ్యాచ్ లో ఆనందం వెల్లి విరుస్తోందనే ప్రచారం వుంది. కొన్న భూములన్నీ వృథా అయిపోతాయోమోనని భావించిన జగన్ బ్యాచ్ కు ఇది కొంత ఊరట కలిగించే అంశమే. అలా ఏపీ బడ్జెట్ జగన్ అండ్ కోకు మేలు చేసిందన్నమాట. మరి ఇటీవల అమరావతిలో భూదందా జరిగిందని గగ్గోలు పెడుతున్న జగన్ అండ్ కో బ్యాచ్ నోటికి ఇలా తాళం వేయాలని భావించారో ఏమో... ప్రతి పక్షనేతల భూములకూ రేటు వచ్చేలా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావించొచ్చేమో.