Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స‌ర్కారు తొలి బ‌డ్జెట్ హైలెట్స్ ఇవే!

By:  Tupaki Desk   |   12 July 2019 8:05 AM GMT
జ‌గ‌న్ స‌ర్కారు తొలి బ‌డ్జెట్ హైలెట్స్ ఇవే!
X
ఎన్నిక‌ల అనంత‌రం చారిత్ర‌క విజ‌యంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా త‌మ తొలి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లే స‌రిగ్గా ఈ మ‌ధ్యాహ్నం 12.22 గంట‌ల‌కు అసెంబ్లీలో ఏపీ ఆర్థిక‌మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి త‌న బ‌డ్జెట్ పాఠాన్ని ప్రారంభించారు. త‌మ నాయ‌కుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పిన‌ట్లుగా పార్టీ మేనిఫెస్టోనే త‌మ‌కు ప‌విత్ర గ్రంథ‌మ‌న్నారు. త‌మ ప్ర‌భుత్వానికి మేనిఫెన్టోనే ప్ర‌ధాన నియ‌మావ‌ళిగా ఉంటుంద‌న్న ఆయ‌న‌.. రాష్ట్రంలో అన్ని వ‌ర్గాలు.. ప్ర‌జ‌లంద‌రికి న్యాయం చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

న‌మ్మ‌కం విశ్వ‌స‌నీయ‌తే ప్రాతిప‌దిక‌గా ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చార‌ని.. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల కోసం త‌మ ముఖ్య‌మంత్రి కృషి చేస్తున్నార‌న్నారు. త‌మ ప్ర‌భుత్వానికి ఒక విజ‌న్ ఉంద‌ని.. దాన్ని రాబోయేకాలంలో నెర‌వేర్చి.. దేశంలోనే రాష్ట్రాన్ని నెంబ‌ర్ వ‌న్ గా నిలుపుతామ‌న్నారు. రాజ‌కీయాల్లో విశ్వ‌స‌నీయ‌త ముఖ్య‌మ‌ని.. ప్ర‌జ‌లు కోరిన పాల‌న కోసం సీఎం జ‌గ‌న్ కృషి చేస్తున్నార‌న్నారు.

మొద‌ట్నించి సీఎం జ‌గ‌న్ చెబుతున్న ప‌లు విష‌యాల్ని బ‌డ్జెట్ ప్ర‌సంగంలో భాగంగా మంత్రి బుగ్గ‌న ప్ర‌స్తావించారు. రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా అంద‌రికి ప్ర‌భుత్వ ప‌థ‌కాల్ని అందిస్తామ‌న్నారు. మ‌హాత్ముని ల‌క్ష్యం సాధించే దిశ‌గా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న చేశామ‌న్న ఆయ‌న‌.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్ని అమ‌లు చేయ‌ట‌మే త‌మ ప్ర‌ధాన క‌ర్త‌వ్యంగా పేర్కొన్నారు. తాము చెప్పిన‌ట్లు న‌వ‌ర‌త్నాల హామీల్లో ఒక దృక్ప‌థం ఉంద‌న్నారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ రెండెంక‌ల వృద్ధి అని ప్రచారం చేశార‌ని.. నిజంగా అంత వృద్ధి సాధిస్తే.. వృద్ధి ఫ‌లాల్ని ప‌క్క‌దారి ప‌ట్టించారా? అని ప్ర‌శ్నించారు.

బుగ్గ‌న‌ బ‌డ్జెట్ లో హైలెట్స్ చూస్తే..

+ బడ్జెట్‌ అంచనా రూ.2,27,974.99కోట్లు

+ రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94కోట్లు

+ మూలధన వ్యయం రూ.32,293.39కోట్లు.

+ 2018-19 బడ్జెట్‌ తో పోలిస్తే 19.32శాతం పెరుగుదల.

+ రెవెన్యూలోటు రూ.1778.52కోట్లు

+ ద్రవ్యలోటు సుమారు రూ.35,260.58కోట్లు

+ ధరల స్థిరీకరణ నిధికి రూ.3000కోట్లు

+ ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002కోట్లు

+ వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి రూ.8,550కోట్లు

+ రైతులకు ఉచిత విద్యుత్‌ కు రూ.4,525కోట్లు

+ గ్రామ సచివాలయాల కోసం రూ.700కోట్లు

+ మున్సిపల్‌ వార్డు వాలంటీర్ల కోసం రూ.280కోట్లు

+ మున్సిపల్‌ వార్డు సచివాలయాల కోసం రూ.180కోట్లు

+ ఏపీఎస్‌ ఆర్టీసీకి సహాయార్థం రూ.1000కోట్లు

+ ఆర్టీసీ రాయితీల కోసం రూ.500కోట్లు

+ ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ కు రూ.260కోట్లు.

+ పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్ ఆర్‌ వడ్డీలేని రుణం కింద రూ.648కోట్లు

+ డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140కోట్లు

+ పారిశ్రామిక మౌలిక కల్పన కింద రూ.250కోట్లు

+ సూక్ష్మ - చిన్న - మధ్య తరహా పరిశ్రమల మౌలిక అభివృద్ధి వనరుల కోసం రూ.200కోట్లు

+ పారిశ్రామిక కల్పన కింద రూ.250కోట్లు

+ చేనేత కార్మికులకు వైఎస్ ఆర్‌ భరోసా కింద రూ.200కోట్లు

+ వైఎస్ ఆర్‌ గ్రాంట్స్‌ కింద మత సంస్థలకు సహాయం రూ.234కోట్లు

+ ఆటో డ్రైవర్ల ఆర్థికసాయం కింద రూ.400కోట్లు

+ కాపుల సంక్షేమానికి రూ.2000కోట్లు

+ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ కు రూ.100కోట్లు

+ బీసీలకు వైఎస్ ఆర్‌ కల్యాణ కానుక కింద రూ.300కోట్లు

+ ఎస్సీలకు వైఎస్ ఆర్‌ కల్యాణ కానుక కింద రూ.200కోట్లు

+ ఎస్టీలకు వైఎస్ ఆర్‌ గిరి పుత్రిక కల్యాణ కానుక కింద రూ.45కోట్లు.

+ మైనార్టీలకు వైఎస్ ఆర్‌ షాదీ తోఫా కింద రూ.100కోట్లు

+ అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.1150కోట్లు

+ వైఎస్ ఆర్‌ గృహ పథకానికి రూ.5వేల కోట్లు

+ న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు రూ.100కోట్లు

+ న్యాయవాదుల ఆర్థిక సాయం కింద రూ.10కోట్లు

+ పౌర సరఫరాల శాఖకు బియ్యం రాయితీ కింద రూ.3000కోట్లు

+ మిగిలిన‌ సరకుల సరఫరాకు రూ.750కోట్లు.

+ పౌరసరఫరాల కార్పొరేషన్‌ కు ఆర్థిక సాయం కింద రూ.384కోట్లు

+ జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,455.80కోట్లు.

+ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.1500కోట్లు.

+ మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077కోట్లు.

+ వైఎస్ ఆర్‌ పాఠశాలల నిర్వహణ గ్రాంటు రూ.160కోట్లు

+ అక్షయపాత్ర ఫౌండేషన్‌ వంటశాలల నిర్మాణానికి రూ.100కోట్లు.