Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్‌ డే అదిరిందిః 1.95 లక్షల కోట్ల పెట్టుబడులు

By:  Tupaki Desk   |   11 Jan 2016 3:57 AM GMT
ఫ‌స్ట్‌ డే అదిరిందిః 1.95 లక్షల కోట్ల పెట్టుబడులు
X
విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో తొలిరోజే అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. మొద‌టిరోజే 32 ఒప్పందాలు ఖరారయ్యాయి. వీటి ద్వారా రాష్ట్రంలో రూ.1.95 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇంధన రంగంలో 22, పరిశ్రమల రంగంలో 9, గనుల రంగంలో 1 కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ స‌ద‌స్సు సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో భారత ఫోర్జ్‌ సీఎండీ బాబా కల్యాణి రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రూ.1,200 కోట్లతో నెల్లూరు జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు బాబా కల్యాణి ప్రకటించారు. అదే విధంగా అనంతపురం జిల్లాలో మరో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రూ.135 కోట్లతో ఎనర్జీ ట్రీట్‌ మెంట్‌ ప్లాంటు ఏర్పాటుచేసేందుకు జీవీఎంసీ సంస్ధ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

మూడు రోజుల విశాఖలో సీఐఐ-ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్వహించ‌నున్న భాగస్వామ్య సదస్సుకు 50 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు - పారిశ్రామిక వేత్తలు హాజరవుకానున్నారు. సభకు దేశ - విదేశ ప్రతినిధులు రావడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇదే క్ర‌మంలో వేదిక ప్రాంగణం ద‌గ్గ‌ర‌ భారీగా పోలీసులు మొహరించి వేదిక ప్రాంతంలో 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం విశాఖలో మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు స్టీల్ సిటీకి శోభ తేవ‌డ‌మే కాకుండా...ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు పెట్టుబ‌డుల‌ను కూడా తెచ్చిపెడుతోంది.