Begin typing your search above and press return to search.

12 రోజుల్లో పెళ్లి.. చైనాలో చిక్కుకున్న‌ క‌ర్నూలు అమ్మాయి

By:  Tupaki Desk   |   2 Feb 2020 4:41 PM GMT
12 రోజుల్లో పెళ్లి.. చైనాలో చిక్కుకున్న‌ క‌ర్నూలు అమ్మాయి
X
ఆమెకు ఇంకో 12 రోజుల్లో పెళ్లి.. ఇటీవలే నిశ్చితార్థం కూడా జ‌రిగింది. ఐతే ఉద్యోగ శిక్ష‌ణ‌లో భాగంగా చైనాకు వెళ్ల‌డం ఇప్పుడు ఆమె జీవితాన్ని త‌ల‌కిందులు చేసింది. స‌మ‌యానికి ఇండియాకు వ‌చ్చి పెళ్లి చేసుకోవ‌డం సందేహంగానే ఉంది. క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న చైనాలో ఉండ‌టం ఆమెకు సంక‌ట స్థితిని తెచ్చిపెట్టింది. జ్వ‌రంతో బాధ ప‌డుతున్న ఆమెను ఇండియాకు పంపేందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఏం చేయాలో పాలు పోని ప‌రిస్థితి త‌లెత్తింది. తమ కూతురిని స్వదేశం రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె త‌ల్లి భారత విదేశాంగ శాఖను కోరుతోంది. ఈ స్థితిలో చిక్కుకున్నది క‌ర్నూలుకు చెందిన శృతి అనే అమ్మాయి కావ‌డం గ‌మ‌నార్హం.

క‌ర్నూలు జిల్లాకు చెందిన శృతి టీసీఎల్ ఉద్యోగ శిక్షణ కోస‌మ‌ని చైనాలోని ఊహాన్‌కు వెళ్లింది. అక్క‌డ ఆమెకు తీవ్ర స్థాయిలో జ్వ‌రం వ‌చ్చింది. ఇంకో 12 రోజుల్లో ఆమె పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. చైనాలో ఉన్న భారతీయులను తీసుకువచ్చేందుకు వెళ్లిన ప్రత్యేక విమానంలో శృతిని అనుమతించలేదు. జ్వరంగా కారణంగానే ఆమెకు విమాన సిబ్బంది అనుమతి నిరాక‌రించారు. జ్యోతి నుంచి విమానంలో ఉన్న మిగ‌తా వాళ్ల‌కూ జ్వ‌రం సోకి ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి త‌లెత్తుతుందేమో అని వాళ్లు భ‌య‌ప‌డ్డారు. ఈ స్థితిలో తన గోడును వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు చెప్పుకున్న జ్యోతి కన్నీరుమున్నీరవుతోంది. త‌న‌కు క‌రోనా వైర‌స్ సోక‌లేద‌ని.. జ్వ‌రం కూడా పెద్ద‌గా లేద‌ని.. టెంప‌రేచ‌ర్ అధికంగా ఉండ‌టంతో విమానంలోకి అనుమ‌తి నిరాక‌రించార‌ని శృతి అంటోంది.జ్యోతికి తండ్రి లేరు. ఈ నేప‌థ్యంలో త‌ల్లి కూతురి గురించి తీవ్ర ఆందోళ‌న చెందుతోంది.