Begin typing your search above and press return to search.
ఏపీలో కొత్త వాహనం.. కొత్త బ్యాగులు
By: Tupaki Desk | 9 May 2020 4:30 AM GMTమిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా రేషన్ బియ్యం సరఫరా విషయంలో ఏపీలోని జగన్ సర్కారు వినూత్నంగా ఆలోచించటం తెలిసిందే. రేషన్ దుకాణానికి వెళ్లి.. బియ్యం తీసుకునేందుకు భిన్నంగా ఇంటింటికి తిరిగి బియ్యాన్ని డెలివరీ చేసేలా భారీ ప్లాన్ ను సిద్ధం చేశారు. ఇందుకోసం చేస్తున్న ఏర్పాట్లు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో బియ్యం డోర్ డెలివరీ కోసం కొత్తగా తెస్తున్న విధానం అందరిని ఆకట్టుకుంటోంది.
బియ్యాన్ని డోర్ డెలివరీ చేసే కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుకు తెర తీశారు. వాహనంలోనే బియ్యం.. లబ్థిదారుల్లో ఎవరికెంత బియ్యాన్ని ఇవ్వాలన్న దానికి అనుగుణంగా తూకం వేసేందుకు వేయింగ్ మిషన్.. దానికి తోడు సంచుల్ని సిద్ధం చేశారు. ఇంటింటికి వెళ్లి.. లబ్దారులకు ఇవ్వాల్సినంత బియ్యాన్ని వారి ముందే తూకం వేసి.. బ్యాగులో పోసి.. సీల్ వేసి ఇచ్చేస్తారు.
డోర్ డెలివరీకి అవసరమైన వాహనాల్ని భారీగా సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయ్యాల్లో అందుబాటులో ఉండేలా 13,370 మొబైల్ యూనిట్లను సిద్ధం చేస్తున్నారు. పారదర్శకతతో పాటు.. తెల్ల రేషను కార్డు ఉన్న వారి ఇంటి ముందుకు వెళ్లి.. వారి కళ్ల ఎదుటే తూకం వేసి బియ్యాన్ని ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన నమూనాల్ని తాజాగా విడుదల చేశారు. ఆకట్టుకునేలా ఉన్న ఈ ఏర్పాటు రానున్న రోజుల్లో మిగిలిన రాష్ట్రాల్లోనూ అమలు చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.