Begin typing your search above and press return to search.

లాక్ డౌన్: ఏపీ ప్రజలకు ఊరట కల్పించిన జగన్!

By:  Tupaki Desk   |   19 April 2020 8:33 AM GMT
లాక్ డౌన్: ఏపీ ప్రజలకు ఊరట కల్పించిన జగన్!
X
ఆర్థిక లోటుతో రోజు గడవడమే కష్టంగా మారిన ఆంధ్రప్రదేశ్ పై కరోనా మరింత పిడుగువేసింది. దీంతో రూపాయి రూపాయి కోసం కష్టపడుతోంది వైసీపీ జగన్ సర్కార్. ఎక్కువగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో ఇప్పుడు కోతల సీజన్. దీంతో కేంద్రం ఏప్రిల్ 20 నుంచి సడలించిన లాక్ డౌన్ మినహాయింపులను ఏపీలో అమలు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. తద్వారా రైతులు - పారిశ్రామిక వర్గాలు - ఉపాధి - ఉద్యోగ వర్గాలు - పేదలకు ఊరట కల్పించారు.

ఏపీలో లాక్ డౌన్ మినహాయింపులపై తీవ్రంగా చర్చించిన జగన్ సర్కారు ఎట్టకేలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో కరోనా లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనల నుంచి మినహాయింపులు లభించనున్నాయి. అయితే మాస్కులు - భౌతికదూరం నిబంధనలు మాత్రం తప్పనిసరి చేశారు. ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులు పంపింది సర్కారు. జగన్ నిర్ణయంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం కరోనా వ్యాపిస్తుందన్న భయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

*ఏపీ ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ మినహాయింపులివీ..

+గ్రామాల్లో రోడ్లు - సాగునీటి ప్రాజెక్టులు - భవన నిర్మాణాలు చేసుకోవచ్చు
+ఐటీ సంస్థల్లో 50శాతం ఉద్యోగులతో పనులు చేసుకోవచ్చు
+ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు పనిచేసేందుకు అవకాశం
+అన్ని రకాల వస్తు రవాణాకు అనుమతి
+వాహన మరమ్మతు కేంద్రాలు - జాతీయ రహదారి పక్కన దాబాలు నిర్వహించుకోవచ్చు.
+ఐస్ ప్లాంట్లు - సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు - ఈ-కామర్స్ సంస్థలకు మినహాయింపు
+సబ్బులు తయారీ కంపెనీలు - ఔష‌ద త‌యారీ సంస్థ‌లు - మాస్కులు - బాడీ సూట్ల తయారీ సంస్థలకు మినహాయింపు
+ఉద్యోగులను తరలించే వాహనాలకు అనుమతి
+లాక్‌ డౌన్ ఆంక్షలను పరిశ్రమల కోసం సడలింపు
+రైస్ - పప్పు మిల్లులు - పిండిమరలు - డైరీ ఉత్పత్తుల పరిశ్రమలకు మినహాయింపు
+అమెజాన్ - వాల్ మార్ట్ - ఫ్లిప్ కార్ట్ కార్యకలాపాలకు స‌డ‌లింపు
+ప్రత్యేక ఆర్థిక మండళ్లు - ఎగుమతుల యూనిట్లకు మినహాయింపు
+కోల్డ్ స్టోరేజీలు - ఆగ్రో ఇండ‌స్ట్రీస్ - బేకరీ - చాక్లెట్ల తయారీ పరిశ్రమలకు మినహాయింపు