Begin typing your search above and press return to search.
మురళీ మోహన్ కు పద్మభూషణ్?
By: Tupaki Desk | 18 Oct 2016 7:35 AM GMTరిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లిస్టు పంపించింది. యథావిధిగా అందులో అస్మదీయులకు అందలం దక్కింది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ మురళీమోహన్ కు దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ కు అందులో సిఫారసు చేశారు. మురళీ మోహన్ సినీనటుడిగా ప్రసిద్ధుడే అయినప్పటికీ రాజకీయంగా చంద్రబాబు పార్టీ నుంచి ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు.
వివిధ రంగాలకు చెందిన 22 మంది పేర్లతో జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించినట్లు తెలుస్తోంది. మురళీ మోహన్ తో పాటుగా రక్షణ శాఖ శాస్త్రీయ సలహాదారు సతీష్ రెడ్డి పేరును పద్మభూషణ్ అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో రజత పతక విజేత పీవీ సింధు - మృదంగ విద్మాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు - ప్రముఖ నృత్య కళాకారిణి ఆనంద శంకర జయంత పేర్లను పద్మభూషణ్ కు సిఫార్సు చేశారు.
మరోవైపు ఎప్పటిలాగే వైద్యరంగం నుంచి పద్మ అవార్డులకు పెద్ద లిస్టే కనిపిస్తోంది. ఈఎన్ టీ స్పెషలిస్ట్ విష్ణుస్వరూపరెడ్డి - ఆర్థోపెడిక్ సర్జన్ గురువారెడ్డితో పాటు ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో సర్జన్‌గా పనిచేస్తున్న సి.కె.దుర్గ పేరును కూడా పద్మ అవార్డుకు సిఫార్సు చేసింది. చేనేత రంగం నుంచి రమణయ్య - బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ పేరును పద్మశ్రీకి సిఫార్సు చేసింది. వీరితోపాటు మరిన్ని రంగాల్లో విశేష కృషి చేసిన వారి పేర్లనూ పద్మశ్రీ - పద్మభూషణ్ అవార్డుల కోసం సిఫార్సు చేస్తూ రాష్ట్రం నుంచి కేంద్రానికి లిస్టు వెళ్లింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/