Begin typing your search above and press return to search.

ఆ సంచుల కోసం 750 కోట్లా?

By:  Tupaki Desk   |   14 Jun 2020 6:32 AM GMT
ఆ సంచుల కోసం 750 కోట్లా?
X
అది నిజమైనా జీవోనా? లేక ఫేక్ గా సృష్టించిందో తెలియదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సెక్రెటరీ పేర్లు మాత్రం సరిగ్గానే కనిపిస్తున్నాయి. అది నిజమైతే మాత్రం వైసీపీ ప్రభుత్వం ఇరకాటంలో పడ్డట్టే.. కేవలం ఆ సంచుల కోసం రూ. 750 కోట్లను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేయడమా? ఆ సంచులకు అన్ని కోట్లు అవుతాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఒక ఏపీ ప్రభుత్వం పేరు మీద ఉన్న ఒక జీవో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఆ జీవోలో ఏముందయ్యా అంత విశేషం అంటే.. ఒక సంవత్సరానికి కాలానికి గాను పేదలకు పంచే ఉచిత రేషన్ బియ్యానికి అవసరమైన సంచుల కోసం రూ.750 కోట్లు వెచ్చిస్తున్నట్టు రిలీజ్ చేస్తున్నట్టు ఉంది. ఆ జీవో ఏకంగా బియ్యం సంచుల కోసం రూ.750 కోట్లు మంజూరు చేసినట్టు ఉండడమే ఇక్కడ పెద్ద వింతగా మారింది. ఇది అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

బియ్యం సంచులకు రూ.750 కోట్లు ఏంటీ అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది నిజమా? అబద్ధమా అని ఆశ్చర్యపోతున్నారు. బియ్యం సంచులకే రూ.750 కోట్లు వెచ్చించే బదులు.. ఇన్ని వందల కోట్లతో ఏకంగా సంచులతోపాటు మెరుగైన బియ్యాన్ని.. లేదంటే సన్నిబియ్యాన్ని ఇవ్వొచ్చు కదా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అంత 750 కోట్లతో ఎంత క్వాలిటీ సంచులు తెస్తారు? అని డౌట్ పడుతున్నారు.

మరికొందరు ఈ జీవో ఖచ్చితంగా ప్రతిపక్ష టీడీపీకి మంచి అవకాశంగా.. ఆయుధంగా లభించినట్లు అయ్యిందని అంటున్నారు. ఏదీ ఏమైనా వైసీపీ నాయకులు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు కేవలం బియ్యం సంచులకే ఇంత బడ్జెట్ అయ్యిందో చూడాలి. లేకుంటే ఇది విమర్శలకు తావిచ్చినట్లు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.