Begin typing your search above and press return to search.
మరో మాజీమంత్రికి ముహూర్తం సిద్ధం చేసిన ఏపీ సర్కార్ !
By: Tupaki Desk | 22 Feb 2020 1:30 PM GMTతెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఏకచక్రాధిపద్యంగా ఏలిన పార్టీ. కానీ , గత ఎన్నికలల్లో చావు దెబ్బ తిని, ప్రస్తుతం మనుగడ కోసం టీడీపీ చేయని పోరాటం , ఎక్కని పంచ లేదు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు టీడీపీని మళ్లీ గదిలో పెట్టేందుకు శతవిధాలా పోరాడుతున్నారు. కానీ , గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు మంత్రులు ఇష్టానుసారంగా అందిన కాడికి దోచుకున్నారు. ఆ పాపాల చిట్టా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుండటం తో టీడీపీ పరిస్థితి మరింత అద్వానంగా తయారైంది.
తాజగా సిక్కోలు కీలకనేత అచ్చెన్నాయుడు, కార్మిక మంత్రిగా ఉండగా ఈఎస్ ఐ లో పెద్ద ఎత్తున చేసిన కొనుగోళ్ళ గోల్ మాల్ పైన వైసీపీ సర్కార్ గురి పెట్టింది. తాజాగా మరో కీలకనేత పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి భూ భాగోతాలపైన కూడా తగిన ఆధారాలతో నిరూపిస్తామని వైసీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి అంటున్నారు.
పెందుర్తి ఎమ్మెల్యేగా ఆయన హయాంలో జరిగిన పెద్ద ఎత్తున భూ దందాలపైన అని వివరాలూ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, వాటిని కూడా వెలుగులోకి తెచ్చి తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్రా జిల్లాల్లో మాజీ మంత్రులు ఇంకా చాలా మందే ఉన్నారు. వారు టీడీపీ హయాంలో బాగానే వెనకేసారు. దీనితో ఇపుడు అచ్చెన్న తరువాత ఎవరు అన్న దాని మీద తమ్ముళ్ళల్లో ఒక్కసారిగా కలవరం పెరిగిపోతోంది. ప్రభుత్వమే ఏకంగా గురి పెడితే, గట్టిగా టార్గెట్ చేస్తే చాలామంది అవినీతి చిట్టాలు బయటకు వస్తాయని , అందులో మా పేరు ఎక్కడ బయటపడుతుందో అని టీడీపీ నేతలలో టెంక్షన్ మొదలైంది.