Begin typing your search above and press return to search.

334 ఒప్పందాలు.. 5 లక్షల కోట్ల ఇన్వెస్టిమెంట్

By:  Tupaki Desk   |   12 Jan 2016 12:26 PM GMT
334 ఒప్పందాలు.. 5 లక్షల కోట్ల ఇన్వెస్టిమెంట్
X
విశాఖ వేదిక మూడో రోజు నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మూడు రోజుల సదస్సులో ఏకంగా 334 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మొత్తం 4 లక్షల 80వేల 878 కోట్లు వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ ఒప్పందాలతో రాష్ట్రంలో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. మంగళవారం ఒక్క రోజే టూరిజం రంగంలో 4,659 కోట్లతో 26 ఒప్పందాలు జరిగాయి. విజయవాడలో ఎడురన్న ఎకరాల్లో అతిపెద్ద కన్వెర్షన్‌ ఏర్పాటుకు మురళీ ఫార్చూన్‌ హోటల్‌ ఒప్పందం చేసుకుంది. వైకేఎం ఎంటర్‌ ప్రైజెస్‌ - ఇంటర్‌ గ్లోబల్‌ హస్పిటాలిటీ కంపెనీలు పలు రంగాల్లొ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

పర్యాటక రంగంలో 27 ఒప్పందాలు కుదిరాయి. మూడో రోజు విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్ఛాపురం నుంచి తడ వరకు అందమైన బీచ్‌ల ఏర్పాటు ప్రతిపాదనలతో రావాలన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలకు తగిన ప్రతిపాదనలతో సంస్థలు ముందుకు రావాలని అన్నారు. విజయవాడలో ఏడున్నర ఎకరాల్లో పెద్ద కన్వెర్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. విశాఖ అందమై బీచ్‌ కొండలతో కూడిన నగరంలో తీర్చిదిద్దేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలోనే ఉంటూ మూడు రోజుల్లో ఏకంగా 5 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడం చంద్రబాబు ఘనతేనని కేంద్ర మంత్రులు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేయడం విశేషం.