Begin typing your search above and press return to search.
అమరావతి డబ్బుల్ని ‘అవసరాల’కు వాడేశారే
By: Tupaki Desk | 5 Dec 2015 4:54 AM GMTమీరో ఇల్లు కట్టుకుంటున్నారు. డబ్బులు టైట్ అయ్యాయి. సాయం కోసం ప్రయత్నించారు. ఇల్లు పూర్తి కావటానికి కొందరు డబ్బులు ఇస్తారు. మరి.. మీరేం చేస్తారు. తీసుకున్న సాయం ఇంటికోసం కాబట్టి.. ఇంటిని పూర్తి చేసేందుకు ఖర్చు చేస్తారు. అంతేకానీ.. వ్యక్తిగత అవసరాలకో.. మరో దానికో దాన్ని ఉపయోగించరు కదా. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది ఏపీ సర్కారు. సీమాంధ్ర ప్రజల కలల పంటగా భావిస్తున్న రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటివరకూ రెండుదఫాలుగా రూ.1850 కోట్లను ఇచ్చింది. తొలుత రూ.1000కోట్లు విడుదల చేసి.. దాంతో రాజధానిలో సౌకర్యాల కోసం వినియోగించాలని చెప్పింది.
అనంతరం మరో రూ.500కోట్లు విడుదల చేసి అమరావతిలో రాజ్ భవన్.. అసెంబ్లీ బిల్డింగ్.. హైకోర్టు నిర్మాణం కోసం ఖర్చు చేయాలని చెప్పింది. అనంతరం మరో రూ.350కోట్లను విడుదల చేసింది. అయితే.. విభజన మిగిల్చిన తీవ్ర ఆర్థిక సంక్షోభం పుణ్యమా అని కేంద్రం నుంచి వచ్చిన మొత్తం.. ఇతర కార్యక్రమాల కోసం వినియోగించటంతో మొత్తం రూ.1850కోట్లలో ఒక్క రూపాయి కూడా అమరావతి నిర్మాణానికి వినియోగించని పరిస్థితి.
అనుకున్న మేర ఆదాయం లేకపోవటం.. ఏపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో భారీ లోటుతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో.. నిధుల్ని ఆయా రంగాలకు వినియోగిస్తోంది. ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న వ్యవసాయం.. రైతురుణమాఫీ.. తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటంతో.. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన మొత్తాన్ని ఇతర ఖాతాలకు తరలించేస్తోంది. దీనిపై కేంద్రం గుర్రుగా ఉంది. ఇలా ఎలా చేస్తారని ప్రశ్నిస్తోంది. అయితే.. కేంద్రం నుంచి వచ్చిన నిధులను..కాస్త అటూఇటూగా ఆయా అవసరాలకే వినియోగిస్తామని ఏపీ చెబుతున్నా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ సర్కారు అలాంటిదేదీ చేయలేని పరిస్థితి నెలకొని ఉందంటున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రం తాను పంపిన రూ.1850కోట్లను రాజధాని కోసం ఖర్చు చేసి.. ఆ వివరాల్ని తమకు పక్కాగా పంపితే తప్పించి.. మిగిలిన నిధుల్ని విడుదల చేసేది లేదని తేల్చి చెప్పింది. దీంతో.. పదేళ్ల కాలపరిమితితో కూడిన రూ.1500కోట్ల బాండ్లను అమ్మాలని ఏపీ సర్కారు డిసైడ్ చేసింది. విభజన అనంతరం బాండ్ల అమ్మకం ద్వారా రూ.9వేల కోట్లు సమకూర్చుకుంది. ఇంత భారీ ఆర్థిక లోటును ఏపీ సర్కారు ఎలా అధిగమిస్తోందన్నదే అతి కీలకమైన సమస్యగా చెప్పాలి.