Begin typing your search above and press return to search.
ప్రత్యేకం కోసం సుప్రీంలో ఏపీ సర్కారు దావా?
By: Tupaki Desk | 3 Aug 2015 8:49 AM GMTముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుంది ఏపీ సర్కారు పరిస్థితి. ఏపీకి ప్రత్యేకహోదా కోసం విపక్షాలు గళం విప్పటం.. ఎవరికి వారు ఆందోళనలు.. ప్రజా ఉద్యమాలకు శంఖం పూరించేందుకు ఏర్పాట్లు చేసుకోవటం ఏపీ సర్కారుకు ఆందోళనకరంగా మారింది.
గడిచిన పద్నాలుగు నెలల్లో విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా వ్యవహరించిన అధికారపక్షం తాజాగా ఢిఫెన్స్ లో పడింది. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చే ఆలోచన లేదని కుండబద్ధలు కొట్టిన కేంద్రమంత్రి మాటతో వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. ఏపీ విపక్షం వైఎస్సార్‌కాంగ్రెస్ మొదలు.. కాంగ్రెస్.. కమ్యూనిస్టులు సైతం ప్రత్యేకం మీద గళం విప్పాలని.. నిరసనలు మరింత ఉధృతం చేయాలని నిర్ణయించటం తెలిసిందే.
దీనికి తోడు.. ఏపీ ప్రజలు కూడా ప్రత్యేక హోదాపై ఏపీ అధికారపక్షం.. కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో.. ప్రజా మద్ధతుతో అటు కేంద్రాన్ని.. ఇటు రాష్ట్రాన్ని ఆడుకోవచ్చన్నది విపక్షాల ఆలోచనగా ఉంది.
అయితే.. ప్రత్యేకంపై విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు.. టీడీపీ సర్కారు ఒక మాస్టర్ ప్లాన్ వేసిందని చెబుతున్నారు. కేంద్రం తమకు మొండి చేయి చూపించటంపై తాము రకరకాలుగా పోరాడుతున్నామన్న వాదనను వినిపించేలా వారు.. ఈ అంశంపై సుప్రీం గడప తొక్కాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
విభజన బిల్లు సందర్భంగా పార్లమెంటులో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట ఇచ్చిన నేపథ్యంలో.. దాన్ని అమలు చేయాలంటూ సుప్రీం ఆదేశాలు ఇచ్చేలా చేస్తే ఎలా ఉంటుందన్న ఐడియాలో ఏపీ అధికారపక్ష నేతలు ఉన్నారు. ఇలా చేస్తే.. కేంద్రం కాస్తంత కోపం ప్రదర్శించినా.. రాష్ట్రంలో విపక్షాల దూకుడుకు కళ్లాలు వేయొచ్చని భావిస్తున్నారు.
కేంద్రానికి కోపం రాకుండా ఉండేందుకు వీలుగా.. ప్రత్యేకం మీద సుప్రీం కోర్టులో కేసు వేసే విషయాన్ని ముందస్తు సమాచారంతో ఇచ్చి.. అనంతరం కేసు వేస్తే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండటంతో పాటు.. మిత్రధర్మాన్ని పాటించినట్లు ఉంటుందన్న భావన తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. ప్రజా ప్రయోజనాలకు మించి.. రాజకీయంతో సర్దుబాటు చేసే ధోరణి ఎక్కువ కాలం నిలవదని.. ఈ వ్యవహారంలో ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తంగా దెబ్బ పడేది ఖాయమన్న విషయాన్ని తమ్ముళ్లు ఆలోచిస్తున్నారో లేదో..?