Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. టీచ‌రు సెల్ తెస్తే చ‌ర్య‌లే!

By:  Tupaki Desk   |   29 July 2019 7:19 AM GMT
జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. టీచ‌రు సెల్ తెస్తే చ‌ర్య‌లే!
X
ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర మార్పు మొద‌లుకావాల్సిందే. వ్య‌వ‌స్థ మారాలంటే కొన్ని ఇబ్బందులు.. క‌ఠిన నిర్ణ‌యాలు త‌ప్ప‌వు. ఆ విష‌యాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గుర్తించార‌ని చెప్పాలి. తాను అనుకున్న‌ట్లుగా ఏపీలో స్కూళ్ల‌ను ప్ర‌క్షాళ‌న చేసే ప‌నిలో భాగంగా సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తాజాగా తీసుకుంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.

అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్ని సంపూర్ణంగా మార్చేస్తాన‌ని.. పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేస్తానంటూ ఆయ‌న హామీ ఇవ్వ‌టం తెలిసిందే. సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొత్త‌ల్లో.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ఫోటోల్ని తీసుకోండి.. ఏడాదిన్న‌ర‌లో ఎంత మార్పు చూపిస్తానో మీరే చూద్దురంటూ ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా ఆయ‌న ఒక కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌ని చేసే టీచ‌ర్లు ఇక‌పై క్లాస్ రూంలోకి సెల్ ఫోన్లు తీసుకురాకూడ‌ద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యింది. త‌ర‌గ‌తి గ‌దిలో పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను బోధించే క్ర‌మంలో సెల్ ఫోన్ వినియోగంపై క‌ఠిన నిర్ణ‌యాన్ని తీసుకుంది ప్ర‌భుత్వం. ఇక‌పై క్లాస్ రూంలో ఎట్టి ప‌రిస్థితుల్లో సెల్ ఫోన్ వాడ‌కూడ‌ద‌ని తేల్చి చెప్పింది.

ఒక‌వేళ క్లాస్ రూంలో టీచ‌రు సెల్ ఫోన్ వాడిన‌ట్లుగా రుజువైతే.. వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశాల్ని జారీ చేసింది. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం ఏమంటే..ఒక‌వేళ స్కూల్ టీచరు క్లాస్ రూంలో సెల్ ఫోన్ ఉన్న‌ట్లుగా రుజువైతే.. స‌ద‌రు టీచ‌రుతో పాటు.. హెడ్మాస్ట‌ర్ మీదా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్నిసాహ‌సోపేత‌మైనదిగా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు. దీన్ని ప‌క్కాగా అమ‌లు చేస్తే.. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ప‌ని తీరు మెరుగుప‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఏడాదిన్న‌ర‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల రూపురేఖ‌లు మారాల‌ని భావిస్తున్న జ‌గ‌న్ ఆశ‌యానికి.. తాజా నిర్ణ‌యం కీల‌కమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.