Begin typing your search above and press return to search.
శంకుస్థాపనకు 400 కోట్లు కాదు 10కోట్లే
By: Tupaki Desk | 16 Oct 2015 4:25 AM GMTఖర్చు విషయంలో తమ మీద వస్తున్న విమర్శల విషయంలో ఏపీ సర్కారు జాగ్రత్తగా ఉంటోంది. తాము చేస్తున్న పనుల గురించి పొగడని వారు.. తమ ఖర్చు గురించి తప్పుడు లెక్కలు చెబుతూ.. ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత వ్యక్తం అయ్యేలా చేసేందుకు రాజకీయ ప్రత్యర్థుల ప్రయత్నాలపై తమ్ముళ్లు జాగ్రత్తగా ఉంటున్నారు. శంకుస్థాపన ఖర్చుకు సంబంధించి ఏ ఒక్కరు విమర్శ చేసినా వెంటనే దానికి బదులిచ్చేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
శంకుస్థాపనను నభూతో నభవిష్యతి అన్నట్లుగా నిర్వహిస్తున్న వేళ.. ఖర్చుపై చాలానే కథనాలు వచ్చాయి. శంకుస్థాపనకు రూ.100 కోట్లు మొదలెట్టి రూ.400 కోట్ల వరకూ అవుతుందన్న లెక్కలు తేల్చారు. అయితే.. ఖర్చు అంత కావటం లేదని.. మొత్తంగా రూ.10కోట్లు అయ్యే అవకాశం ఉందని.. ఇప్పటివరకూ గుంటూరు కలెక్టర్ కు రూ.7కోట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ కు రూ.2కోట్లు మాత్రమే నిధులు విడుదల చేశామని చెబుతున్నారు.
వార్తల్లో వచ్చినట్లుగా ప్రత్యేక విమానాలు.. ఆడి. బెంజ్ లాంటి కార్ల దగ్గర నుంచి మిగిలిన చాలా అంశాల వరకూ అందరూ తమకు తాముగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారని.. పలువురు వీవీఐపీలు.. ప్రముఖులు తమ ఖర్చు తామే పెట్టుకుంటున్నారని ఏపీ మంత్రులు వివరణ ఇస్తున్నారు. ఖర్చు విషయంలో తాము ఎంత పక్కాగా ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తూ.. యాంకరింగ్ చేస్తున్నసాయికుమార్ సైతం.. ఉచితంగా చేస్తున్నారని.. ఎలాంటి పారితోషికం తీసుకోవటం లేదని చెప్పుకొచ్చారు.
శంకుస్థాపన కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నారంటూ విమర్శలు చేయటమే కాదు.. ఒక్కరోజు కార్యక్రమం కోసం రూ.400కోట్లు ఖర్చు చేస్తున్నరంటూ ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ సైతం రూ.400కోట్లు ఖర్చుచేస్తున్నట్లు పేర్కొన్న నేపథ్యంలో.. ఆయన మాటల్లోనిజం లేదని.. పెడుతున్న ఖర్చు రూ.400 కోట్లు కాదని కేవలం రూ.10కోట్లు మాత్రమేనని చెప్పటమే కాదు.. అదెలా సాధ్యమో కూడా ఏపీ మంత్రులు వివరణ ఇవ్వటం గమనార్హం.