Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను ఇరుకున పెడుతున్నారు
By: Tupaki Desk | 27 Aug 2015 3:39 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొద్దికాలం కిందటి వరకు కేసీఆర్ పరిపాలనను విమర్శించిన టీడీపీ ఇపుడు ఆయన పరిపాలన వల్ల ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మొదలుపెడుతోంది. హైదరాబాద్ లో పేదల కోసం నిర్మించిన ఇళ్ల వద్దకు వెళ్లి అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు సమీక్షించారు. దీంతో పాటు అక్కడ ఏమేం కావాలో పేదలను అడిగి తెలుసుకొని బస్తీ వాసుల మనసు దోచుకున్నారు. దీంతోపాటు తాజాగా మరో అడుగువేశారు.
కర్ణాటక ప్రభుత్వం కృష్ణానది పై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై గవర్నర్ నరసింహన్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఆల్మట్టీ ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. ఈ విషయమై తాము ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన స్పందించడం లేదంటూ ఆక్షేపించారు. అయితే ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల తెలంగాణ రైతాంగానికి ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌లను అడ్డుకునేలా కేంద్ర పభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు గవర్నర్‌ను కోరారు. ఈ సందర్భంగా వారు గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు.
మొత్తంగా గతంలో ఉత్తర తెలంగాణకు నష్టం చేకూర్చేలా మహారాష్ర్ట నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసి రైతాంగానికి అండగా నిలుస్తామనే సందేశం పంపిన టీడీపీ ఇపుడు దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసేలా కర్ణాటక కడుతున్న ప్రాజెక్టులను నిలుపుదల చేసేందుకు ప్రయత్నం రైతుల నుంచి సానుకూల అభిప్రాయం సంపాదించడంలో విజయం సాధించేందుకు ఉపయోగపడుతుందేమో.