Begin typing your search above and press return to search.
తెలంగాణ టు ఏపీ..ఈ కండీషన్స్ తప్పనిసరి!
By: Tupaki Desk | 8 Jun 2020 4:20 PM GMTఏపీ-తెలంగాణ మధ్య మరో దుష్ప్రచారం మొదలైంది. ఏపీ తెలంగాణ మధ్య ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టులను సోమవారం నుంచి ఎత్తివేస్తారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. .ఈ వార్తలను నమ్మవద్దంటూ ఏపీ అధికారులు వెల్లడించారు.రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఎత్తేస్తేరనే వార్తలు నిరాధారమైనవని స్పష్టంచేశారు.
ఏపీ-తెలంగాణ మధ్య చెక్ పోస్టులు యధాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పాయింట్లను రేపటి నుంచి తొలగిస్తున్నట్టు వస్తున్న ప్రచారం అవాస్తమని ఆయన తెలిపారు. చెక్ పోస్టులు తొలగించే నిర్ణయమేదీ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. కోవిడ్ ఆర్డర్ 55 ప్రకారం చెక్ పోస్టులను యథాతథంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రవేశాలను నియంత్రిస్తామని ఆయన తెలిపారు.
ఏపీలోకి రావాలనుకునే వారు స్పందన యాప్ లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని..రాష్ట్రానికి వచ్చే వారందరికీ కరోనా టెస్ట్ చేస్తామని తెలిపారు. మహారాష్ట్ర - తమిళనాడు - మధ్యప్రదేశ్ - ఢిల్లీ - రాజస్థాన్ - పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే వారు ఎవరైనా వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేశారు.
ఇక ఏపీ నుంచి తెలంగాణ కు ప్రస్తుతానికి బస్సులు నడపడానికి అనుమతి లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తే వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కు బస్సులు నడుపుతామని కృష్ణబాబు తెలిపారు.
పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చే వారికి ఎలాంటి ఆంక్షలు, చెక్ పోస్టులు లేవనే ప్రచారం తప్పు అని.. ప్రజలు గ్రహించాలని కృష్ణబాబు పేర్కొన్నారు.