Begin typing your search above and press return to search.

ఏపీ ఆఫీసుల్లో ఏం జరుగుతోందంటే..

By:  Tupaki Desk   |   30 Dec 2017 6:52 AM GMT
ఏపీ ఆఫీసుల్లో ఏం జరుగుతోందంటే..
X
ఒకప్పుడు చంద్రబాబు పాలనలో ఉద్యోగులకు ఆఫీసంటే వణుకు పుట్టేది.. పని పెండింగు ఉంటే ఎప్పుడు ఎట్నుంచి చంద్రబాబు వచ్చి సస్పెండ్ చేస్తారో అన్న భయం ప్రతి ఉద్యోగిలోనూ ఉండేది. అయితే... అదే తీవ్ర వ్యతిరేకతకు దారి తీసి ఆ తరువాత చంద్రబాబు ఓటమికి కారణమైంది. చంద్రబాబును పదేళ్లు అధికారానికి దూరం చేసింది. దీంతో చంద్రబాబు ఈ టెర్ములో ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. దీంతో కార్యాలయాలు గాడి తప్పాయన్న విమర్శలు వస్తున్నాయి. అందరు ఉద్యోగులూ అలాంటి వారే అని చెప్పడానికి లేదు కానీ.. చాలామంది మాత్రం చంద్రబాబు పాలనతో ఉద్యోగాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని వినిపిస్తోంది. సాక్షాత్తు చంద్రబాబు స్వయంగా చేయిస్తున్న సర్వేల్లోనూ ఇదే విషయం తేలిందట.

ముఖ్యంగా ఆఫీసులకు కల్పించిన ఇంటర్నెట్ సదుపాయం కారణంగా సగం పని కుంటుపడుతోందని తెలుస్తోంది. చాలాచోట్ల ఆఫీసుల్లో ఉద్యోగులు కొందరు పనులను పక్కనపెట్టి ఇంటర్నెట్ లో మునిగి తేలుతన్నారట. కొందరు సొంత పనుల కోసం ఇంటర్నెట్‌ ను తెగ వాడేస్తుంటే మరికొందరు బూతు వీడియోలు చూడడం - వాటిని డౌన్‌ లోడ్ చేయడం వంటివి చేస్తున్న విషయం తాజాగా వెల్లడైంది.

నెలకు రూ.999కే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌ తో నెలకు 50 జీబీని ఏపీ స్టేట్ పైబర్ నెట్ కార్పొరేషన్ ప్రభుత్వ కార్యాలయాలకు అందిస్తోంది. దీనిని అవకాశంగా తీసుకున్న కొందరు ఉద్యోగులు వ్యక్తిగత అవసరాల కోసం ఇంటర్నెట్‌ ను ఉపయోగించుకుంటున్నారు. డౌన్‌ లోడ్లు పెరిగిపోవడంతో నెల రోజులు రావాల్సిన 50 జీబీ రెండుమూడు రోజలకే కరిగిపోతోందట. దీంతో ఆఫీసు పనులు చేయాల్సి వచ్చినప్పటికి ఇంటర్నెట్ లేక పనులు ఆగిపోతున్నాయట.