Begin typing your search above and press return to search.
శంకుస్థాపన ఖర్చు రూ.400కోట్లా..?
By: Tupaki Desk | 9 Oct 2015 6:23 AM GMTఓపక్క వణికించే ఆర్థిక లోటు.. మరోపక్క ప్రభుత్వ ఉద్యోగులకు నెలసరి జీతాల కోసం నిధుల కోసం వెతుక్కునే పరిస్థితి.. ఏపీ సర్కారు దుస్థితి. మరి ఇలాంటి రాష్ట్రం తన రాజధాని నగరాన్ని నిర్మించుకోవటానికి భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని నిర్మాణం సంగతేమో కానీ.. ఒక్క శంకుస్థాపన కార్యక్రమం కోసం దాదాపు రూ.400కోట్ల మేర ఖర్చు పెట్టేందుకు ఏపీ సర్కారు సిద్ధమైందని చెబుతున్నారు.
శంకుస్థాపనతో ఏపీ రాజధాని అమరావతిని హాట్ టాపిక్ చేయటంతో పాటు.. మోస్ట్ హాపినింగ్ ప్లేస్ చేయాలన్నది చంద్రబాబు తపనగా కనిపిస్తోంది. అయితే.. దీని కోసం రూ.400కోట్ల విలువైన నిధుల్ని కేవలం ఒక కార్యక్రమం కోసం ఖర్చు చేయటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శంకుస్థాపనకు రూ.400కోట్ల వరకూ ఖర్చుకావాల్సిన పనేందన్న మాట అంటే చాలు.. భారీ చిట్టాను విప్పి చెబుతున్నారు.
శంకుస్థాపనకు దేశ.. విదేశీ అతిధులతో పాటు.. దాదాపు 13 జిల్లాల నుంచి 10 లక్షలమంది జనసమీకరణ చేపట్టాలని బాబు సర్కారు భావిస్తోంది. ఇందుకోసం భారీగానే ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించే సంస్థకు చెల్లించే ఫీజు రూ.10కోట్లు అయితే.. వీవీఐపీ అతిధులకు సాదర స్వాగతం పలికేందుకు వీలుగా భారీ సంఖ్యలో విమానాల్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో విమానాశ్రయ అద్దెలు.. విమానాల కోసం.. హెలికాఫ్టర్ల కోసం పెడుతున్న ఖర్చు ఒక్కటే దాదాపు రూ.100కోట్ల మేర ఉంటుందని చెబుతున్నారు. ఇక.. పది లక్షల మందికి భోజనాలు.. అతిధులకు దాదాపు వారం వరకూ వసతి.. భోజనాలకు సంబంధించిన ఏర్పాట్ల కోసం దాదాపు రూ.60కోట్ల మేర ఖర్చు అవుతుందని చెబుతునారు. ఇక.. విజయవాడ జాతీయ రహదారి నుంచి తూళ్లురులోని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించే ప్రాంతానికి నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి కూడా భారీగా నిధుల్ని ఖర్చు చేస్తున్నారు.
ఇక.. విజయవాడ సిటీ లుక్ ను పూర్తిగా మార్చేందుకు.. సుందరీకరణ పనుల కోసం కూడా భారీగా ఖర్చు చేయనున్నట్లు చెబుతున్నారు. ఇక.. శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించే ప్రాంతంలో ఏర్పాట్లతోపాటు.. పది లక్షలమందితో కార్యక్రమాన్ని ద్విగ్విజయంగా పూర్తి చేసేందుకు వీలుగా భారీ ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం శంకుస్థాపన కార్యక్రమం పూర్తి అయ్యేందుకు దాదాపుగా రూ.400కోట్ల ఖర్చు గ్యారెంటీ అన్న మాట వినిపిస్తోంది.