Begin typing your search above and press return to search.
న్యాయస్థానం అనుమతితోనే పోలవరం పనులు!
By: Tupaki Desk | 27 Sep 2019 7:44 AM GMTఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రతిపాదనను ప్రతిపక్ష పార్టీ కావాలనే వివాదాస్పదం చేస్తున్నది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు అధికారాలు వాస్తవంగా కేంద్రం ఆధీనంలో ఉన్నప్పటికీ - రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని తప్పుడు ఆరోపణలకు దిగుతోంది. పోలవరం పనులను తక్కువ ధరలకు చేపట్టేందుకు ముందుకు వచ్చిన కారణంగా మేఘా ఇంజనీరింగ్ పై చంద్రబాబు ఎలక్ట్రిక్ బస్సుల క్విడ్ ప్రోకో అరోపణలకు దిగుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి మూడేళ్లలో రూ.3545 కోట్లు వ్యయం చేసేందుకు కేంద్రం నిర్ణయించగా.. ఆయన మాత్రం ఏకంగా ఏపీలోనే ఈ ఏడాది రూ.7500 కోట్ల కుంభకోణం జరుగుతోందంటూ సత్యదూరమైన ఆరోపణలకు దిగుతున్నారు. పైగా దానికి క్విడ్ ప్రోకో అంటూ కొత్త నామకరణం చేసి తమ కాలంలో జరిగిన అక్రమాలు - అవకతవకల నుంచి బయటపడేందుకు సరికొత్త ఆరోపణలను చంద్రబాబు తెరమీదకు తెచ్చారు.
న్యాయస్థానం అనుమతితోనే పోలవరం పనులు:
పోలవరం రివర్స్ టెండరింగ్ లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ 12.6 శాతం తక్కువ ధరలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చి పనులను దక్కించుకుంది. అయితే దీనిని కోర్టు క్లియర్ చేసిన తర్వాతే పనులను ఆ సంస్థ పొందబోతోంది. యాదృచ్ఛికంగా - ఈ రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో పాల్గొన్న ఎంఇఐఎల్.. ఎలక్ట్రిక్ బస్సుల విభాగంలో లిస్టెడ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ను కలిగి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడం ద్వారా సర్దుబాటు చేస్తుందని చంద్రబాబు అర్థంలేని ప్రచారానికి దిగారు. ఇవి పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలని ఇట్టే తెలిసిపోతుంది. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అంటే 2018 మే 23న అవే ఒలెక్ట్రా బస్సులను రాజధాని అమరావతి నగరంలో - ఆలయ నగరమైన తిరుమలలో ట్రయల్ రన్ నిర్వహించింది.
ఏపీకి 350 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు:
దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లోని 64 నగరాల్లో ఈ బస్సుల వినియోగించేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రానున్న మూడేళ్ళలో రూ. 10000 కోట్ల సహాయాన్ని రాష్ట్రాలకు ప్రకటించింది. అందులో భాగంగా 7000 బస్సులను అన్ని రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు సేకరించేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 28న స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏడాది మొత్తం 3545 కోట్లు ఈ-బస్సుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసింది. అయితే చంద్రబాబు నాయుడు ఏకంగా లేని బడ్జెట్ ను సృష్టించి అంతకన్నా రెట్టింపు అంటే 7500 కోట్లు ఒక్క ఏపీలోనే స్కాం జరుగుతోందంటూ విచిత్రమైన ఆరోపణలు చేశారు. కేంద్రం కేటాయించిన నిధులతో అన్ని రాష్ట్రాలు కలిపి 5595 బస్సులను సేకరించాలి. అందుకు 3545 కోట్లు కేంద్రం విడుదల చేస్తోంది. మొత్తం బస్సుల్లో ఏపీకి 350 కేటాయించారు. ఆ ప్రకారం ఏపీకి ఆ మొత్తం నుంచి నిధులు విడుదలవుతాయి. అందుకు తగిన విధంగానే ఆర్టీసీ ఏడాదికి 144 కోట్ల బడ్జెట్ ను వ్యయం చేయాల్సి వస్తోందని అంచనా వేసుకుంది. దీనివల్ల ఆర్టీసీకి ఏడాదికి సరాసరిన 1000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. కానీ చంద్రబాబు మాత్రం అస్సలు లేని బడ్జెట్ నే సృష్టించి ఆ విధమైన ఆరోపణలను తాను మాత్రమే చేయగలనని నిరూపించారంటూ పారిశ్రామిక వర్గాలు విస్తుపోతున్నాయి.
దేశంలో ఈ-బస్సుల ఉత్పత్తి - తయారీలో ఒలెక్ట్రాతో పాటు టాటా - అశోకా లైలాండ్ - మహేంద్ర మొదలైన సంస్థలు ఉన్నాయి. ఈ నెల 26న ఏపీఎస్ ఆర్టీసీ నిర్వహించిన ప్రిబిడ్ సమావేశంలో 18 సంస్థలకు సంబంధించిన 27 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే వాటిలో చాలా కంపెనీల బస్సులు ఎత్తైన ప్రాంతాల్లో నడవలేని పరిస్థితి ఉంది. తిరుమల - తిరుపతి మధ్య ఒలెక్ట్రా బస్సులు మాత్రమే నడపడం సాధ్యమవుతుందనేది హిమాచల్ ప్రదేశ్ లో మిగిలిన సంస్థల బస్సుల విఫలం కావడాన్ని బట్టి స్పష్టంగా చెప్పవచ్చని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫేమ్-2 కింద 350 బస్సులను ఏపీకి మంజూరు చేసింది. ఈ బస్సులను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న విధంగానే లీజు పద్ధతిలో ఉత్పత్తి సంస్థ నుంచి తీసుకుంటారు. కిలోమీటర్ చొప్పున నిర్ధారిత ధర ప్రకారం చెల్లింపులు చేస్తారు. 12 ఏళ్లపాటు ఆ సంస్థలే నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. కిలోమీటర్ కు నిర్ధారించిన ధర ప్రకారం చెల్లించే విధానాన్ని అమలు చేస్తోంది. ప్రాథమికంగా కిలోమీటర్ కు రూ. 39 చెల్లించాలని భావిస్తున్నారు. అయితే టెండర్ లో ఏ సంస్థ తక్కువ ధరకు కోట్ చేస్తే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రకారం చెల్లిస్తారు. ఇందుకోసం అక్టోబర్ 14న ఫైనాన్స్ బిడ్ తెరుస్తారు.
తక్కువ ధరకు పోలవరం బిడ్.. టీడీపీ అక్కసు:
తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి త్వరితగతిన పూర్తిచేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన విధంగా పోలవరాన్ని కూడా శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. తద్వారా తెలుగు ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడాలనుకుంది. అందుకోసం తక్కువ ధరలకు బిడ్ దాఖలు చేసి పనులు దక్కించుకుంది. ఈ పరిణామం టీడీపీ నేతలకు మింగుడుపడటంలేదు. తక్కువ ధరలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చిందనే కారణంతో మేఘాపై అర్థంలేని ఆరోపణలకు దిగుతోంది. ఇందులో భాగంగా ఒలెక్ట్రా బస్సుల క్విడ్ ప్రోకో అంటూ అవాస్తవాలను తెరమీదకు తెచ్చారు.
చంద్రబాబు హయాంలో పోలవరం పేరుతో జరిగిన అవినీతి - అక్రమాలను వైసీపీ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఆధారాలతో సహా నిరూపించింది. దీంతో టీడీపీ నాయకుల అసలు రంగు బయటపడటంతో వారికి ఏం మాట్లాడాలో తెలియని గందరగోళంలో పడిపోయారు. 2018లోనే పోలవరాన్ని పూర్తిచేస్తానని - విఫలమైన చంద్రబాబు తాను చేసిన అవినీతి బయటకు వచ్చే సరికి - ఇక తప్పించుకునే అవకాశం లేదని భావించి తప్పుడు ఆరోపణలకు తెరతీశారు. అందుకు పచ్చమీడియా విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ప్రజల మదిలో వాస్తవం అనిపించేందుకు ప్రయత్నిస్తోంది.