Begin typing your search above and press return to search.

ఏపీ హెలికాఫ్ట‌ర్ లో కేసీఆర్‌ ను తీసుకెళ‌తారు

By:  Tupaki Desk   |   19 Oct 2015 9:08 AM GMT
ఏపీ హెలికాఫ్ట‌ర్ లో కేసీఆర్‌ ను తీసుకెళ‌తారు
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాక ఖాయ‌మైన నేప‌థ్యంలో.. ఆయ‌నో ప్ర‌త్యేక అతిధిగా మారిపోయారు. ఆయ‌న‌కు ఎలాంటి నొప్పి లేకుండా.. వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇచ్చి.. ఆంధ్రుల ఆతిధ్యం ఎలా ఉంటుందో చూపించ‌టంతో పాటు.. ఆయ‌న‌కు ఏ మాత్రం ఇబ్బంది క‌ల‌గ‌కుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేకంగా ఆదేశాలు జారీ చేసిన‌ట్లు చెబుతున్నారు.

శంకుస్థాప‌న ఇన్విటేష‌న్ ఇచ్చిన సంద‌ర్భంగా అమ‌రావ‌తికి కేసీఆర్ ఎలా వ‌స్తార‌న్న ప్ర‌శ్న‌కు.. సూర్యాపేటకు తాను ముందురోజు వెళుతున్నాన‌ని.. అక్క‌డ నుంచి తాను రోడ్డు మార్గం గుండా అమ‌రావ‌తి చేరుకుంటాన‌ని కేసీఆర్ చెప్ప‌టం తెలిసిందే.

అయితే.. రోడ్డు మార్గంలో భ‌ద్ర‌తా ప‌ర‌మైన ఏర్పాట్లకు ఇబ్బంది క‌లిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రిని సూర్యాపేట నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్‌ పోర్ట్ కి హెలికాఫ్ట‌ర్ లో రావాల‌ని.. అక్క‌డ నుంచి ఏపీ స‌ర్కారు ఏర్పాటు చేసిన హెలికాఫ్ట‌ర్ లో శంకుస్థాప‌న జ‌రిగే ప్రాంతానికి తీసుకెళ్లేలా చేస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నారు.

రోడ్డు మార్గంలోఇబ్బంది ఏర్ప‌డే అవ‌కాశం ఉన్నందున‌.. సూర్యాపేట నుంచి హెలికాఫ్ట‌ర్ ద్వారా గ‌న్న‌వ‌రానికి తీసుకెళ్ల‌టం.. అక్క‌డ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి.. కేసీఆర్‌ కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చేయాల‌న్న ఏపీ అధికారుల భావ‌న‌గా చెబుతున్నారు. శంకుస్థాప‌న జ‌రిగే ప్రాంతానికి ద‌గ్గ‌ర‌గా ఉద్దండ‌రాయుని పాలెంలో ప్ర‌ధాని కోసం మూడు హెలిప్యాడ్ లు.. ముఖ్య‌మంత్రులు లాంటి వీవీఐపీల కోసం మ‌రో ఐదు హెలిప్యాడ్ లు సిద్ధం చేశారు. గ‌న్న‌వ‌రం నుంచి కేసీఆర్ ను ఏపీ స‌ర్కారు హెలికాఫ్ట‌ర్ లో శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి తీసుకెళ్లాల‌న్న ఉద్దేశంలోఏపీ స‌ర్కారు ఉంది. దీనికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ను తెలంగాణ సీఎంవోకు పంపిన‌ట్లు చెబుతున్నారు. మొత్తానికి ఏపీ హెలికాఫ్ట‌ర్ లో తెలంగాణ సీఎం ప్ర‌యాణించ‌టం కాస్తంత ఆస‌క్తిక‌ర‌మైన అంశ‌మే. ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు శంకుస్థాప‌న నాటికి మ‌రెన్ని చోటు చేసుకుంటాయో..?