Begin typing your search above and press return to search.

మ‌ద్యంపై ఏపీ స‌ర్కార్ కీల‌క అడుగు...

By:  Tupaki Desk   |   2 Sep 2019 4:30 AM GMT
మ‌ద్యంపై ఏపీ స‌ర్కార్ కీల‌క అడుగు...
X
ప్ర‌జ‌ల‌కు మ‌ద్యాన్ని దూరం చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్న ఏపీ ప్ర‌భుత్వం ఆ దిశ‌గా కీల‌క అడుగు ముందుకేసింది. ఇప్ప‌టికే బెల్టు షాపుల‌పై ఉక్కుపాదం మోపిన ప్ర‌భుత్వం.. క్ర‌మంగా రాష్ట్రం మ‌ద్యం మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఇక నుంచి ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం దుకాణాలు నిర్వ‌హిస్తోంది. ప్రైవేట్ మద్యం దుకాణాలు ఇక క‌నుమ‌రుగుకానున్నాయి. రాష్ట్రంలో 470 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.

నిజానికి.. 504 మద్యం దుకాణాలు ప్రారంభించాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ అనుకున్న‌ప్ప‌టికీ షాపులు ఏర్పాటుచేసే ప్రదేశాలపై ప్ర‌జ‌ల నుంచి అభ్యంతరాలు - వర్షాల కారణంగా 34 షాపులను ప్రారంభించలేదు. అయితే.. ఒక‌టి రెండు రోజుల్లోనే వీటిని ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తోంది.

ప్ర‌భుత్వ మ‌ద్యం షాపుల‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ప్రారంభమైన మద్యం షాపుల ఎదుట ఎమ్మార్పీ బోర్డులు - సమయ పాలన వివరాలు - మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం వంటి నినాదాలతో బ్యానర్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇదిలా ఉండ‌గా.. సెప్టెంబ‌ర్‌ నెలాఖరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం వ్యాపారం పూర్తిగా క‌నుమ‌రుగు కానుంద‌ని ఎక్సైజ్‌ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే.. అక్టోబర్‌ 1 నుంచి మొత్తం 3,500 మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవనున్నాయి. దీంతో ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ మ‌ద్యం విక్ర‌యాల‌కు చెక్‌ ప‌డిన‌ట్టేన‌ని ప‌లువురు అంటున్నారు. అంతేగాకుండా.. క‌ల్తీమ‌ద్యానికి ఇక ఏమాత్రం అవ‌కాశం ఉండ‌ద‌ని చెబుతున్నారు. నిజానికి.. ప్రస్తుతం 4,380 మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో 20 శాతం దుకాణాలను తగ్గించి 3,500 షాపులు మాత్రమే ఇకపై నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే.. ప్రభుత్వ మద్యం షాపుల్లో ఇకపై ఒకొక్కరికి మూడు మద్యం బాటిళ్లు మాత్రమే విక్రయించనున్నారు. ఇప్పటి వరకు ఆరు మద్యం బాటిళ్ల వరకు విక్రయించేందుకు అనుమతి ఉండగా - దీనిని సగానికి తగ్గించేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. మరోవైపు.. మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను సైతం ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇలా ప‌క‌డ్బందీ ప్ర‌ణాళికతో ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం.. తొంద‌ర‌లోనే.. మ‌ద్యం మ‌హ‌మ్మారిని త‌రికొట్ట‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.