Begin typing your search above and press return to search.
కరోనాతో జగన్ సర్కారుకు జరిగిన నష్టం రూ.5వేల కోట్లు?
By: Tupaki Desk | 15 March 2020 1:30 PM GMTప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని మాత్రమే కాదు.. తలరాతల్ని సైతం మార్చేసింది మాయదారి కరోనా. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి కారణంగా జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఇలాంటి కరోనా కారణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లినట్లుగా చెప్పాలి. కరోనా కారణంగా జగన్ సర్కారుకు ఎందుకంత నష్టం వాటిల్లిందన్నది చూస్తే.. ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి.
కరోనా పుణ్యమా అని స్థానిక ఎన్నికల్నిఆరువారాల పాటు వాయిదా వేస్తూ.. ఏపీ ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీంతో.. సకాలంలో స్థానిక ఎన్నికల్ని నిర్వహించలేని కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన భారీ గ్రాంట్ మిస్ కానుంది. సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి చేసిన పక్షంలో రూ.5వేల కోట్ల మొత్తం ఏపీకి వచ్చే వీలుంది. ఒక విధంగా చూస్తే.. ఈ నిధుల్ని సొంతం చేసుకోవటం కోసమే.. యుద్ధ ప్రాతిపదికన స్థానిక ఎన్నికల్ని నిర్వహిస్తోంది జగన్ సర్కారు.
కేంద్రం నిర్దేశించిన గడువు కంటే ముందే (మార్చి 31) స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు..కార్పొరేషన్లు.. గ్రామ పంచాయితీల ఎన్నికల్ని పూర్తి చేస్తే.. కేంద్రం నుంచి రూ.5వేల కోట్ల మేర నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఈ నెలాఖరు లోపు స్థానిక సంస్థలకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులతో కూడిన పాలనను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియ షురూ అయి.. ఎన్నికలు జోరుగా సాగుతున్న వేళ.. కరోనా కారణంగా ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవటం ఏపీ సర్కారుకు షాకింగ్ గా మారింది.
వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్ని2018లోనే పూర్తి చేయాల్సి ఉంది. అయితే.. నాటి చంద్రబాబు సర్కారు ఈ ఎన్నికల నిర్వహణ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలు నిర్వహించిన పక్షంలో.. ప్రభుత్వంమీద ఉన్న వ్యతిరేకత ఫలితాల రూపంలో కనిపిస్తే..ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో బాబు ఎన్నికల విషయాన్ని పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత.. స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలని బాబు భావించారు. అనూహ్యంగా ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురుకావటం.. జగన్ ముఖ్యమంత్రి కావటం జరిగిపోయింది. ప్రభుత్వం కాస్త స్థిరపడి.. పాలన గాడిలో పడినంతనే.. స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి 31లోపు పూర్తిచేస్తే కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావన్న మాటతో హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికల్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఎన్నో అంచనాలతో సాగుతున్న ఎన్నికల్ని.. కరోనా కారణంగా వాయిదా వేయటం ఏపీ సర్కారుకు భారీ నష్టం వాటిల్లిందన్న మాట వినిపిస్తోంది.