Begin typing your search above and press return to search.
ఒక చేత్తో పెంపు.. మరో చేత్తో తగ్గింపు
By: Tupaki Desk | 18 March 2016 8:03 AM GMTఉద్యమాలతో వేతనాలు సాధించుకున్న కొత్త జీతాలు అందుకోబోతున్న అంగన్ వాడీ సిబ్బంది ప్రభుత్వం మరో దెబ్బ వేస్తోంది. వార్షిక ఆదాయ పరిమితి దాటారంటూ తెల్లకార్డుల్ని సామూహికంగా తొలగించేందుకు రెడీ అవుతోంది. ఇంకా కొత్త జీతాలు చేతికి రాకుండానే అంగన్ వాడి ఉపాధ్యాయులు ’తెల్ల’బోయే పరిస్థితి ఎదురవుతోంది.
ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం వల్ల 55వేల 607 మంది అంగన్ వాడీ ఉపాధ్యాయులు తెల్లరేషన్ కార్డులను కోల్పోనున్నారు. ఇప్పటివరకు వర్కర్లకు నెలకు రూ.4200లు - హెల్పర్లకు రూ.2200 చెల్లిస్తూ వచ్చింది. తెల్లకార్డు పొందటానికి గ్రామాల్లో రూ.72వేలు పట్టణాల్లో రూ.75వేలను వార్షికాదాయ పరిమితి అన్న నిబంధన ఉంది. అంగన్వాడీ వర్కర్లకు ముందు రూ.7వేలకు.. హెల్పర్లకు రూ.4,500లకు పెంచడానికి అంగీకరిస్తూ ఈమేర ఏప్రిల్ నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీని ప్రకారం వర్కర్ల వార్షిక వేతనం రూ.84 వేలు అవుతుంది. అంటే తెల్ల కార్డు ఆదాయ పరిమితిని దాటేస్తున్నారు. దీంతో మీకు తెల్లకార్డులను ఎందుకు తొలగించరాదో తహశీల్దార్ కార్యాలయంలో డెప్యూటీ తహశీల్దార్ (సివిల్ సప్లయి) సంజాయిషీ ఇచ్చుకోవాలని లేనిపక్షంలో తమ వద్దనున్న ఆధారాల ప్రకారం గులాబీ కార్డుకు సిఫార్స్ చేస్తామంటూ అంగన్ వాడీ వర్కర్లకు రెవెన్యూ డిపార్టుమెంటు నుంచి నోటీస్ లు జారీ అవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి నోటీసులు ఇప్పటికే చాలామందికి అందగా మిగతా జిల్లాల్లోనూ ఇది మొదలైనట్లు సమాచారం.
కాగా వార్షిక వేతనం రూ.84వేలు దాటుతున్న కారణంగానే నోటీసులు జారీ చేయబోతున్నామని అధికారులు చెబుతుండగా.. కక్ష సాధింపు కోసమే ఇలా చేస్తున్నారని కార్మిక సంఘాలు అంటున్నాయి. నిబంధనల ప్రకారం వారు తెల్లకార్డుకు అర్హులు కాకపోయినా కూడా రాష్ర్టంలో నేతలు - ప్రజాప్రతినిధులు - పెద్దపెద్ద ఉద్యోగులు కూడా తెల్లకార్డులు పొందిన క్రమంలో ఇలా అంగన్ వాడీ కార్మికులపై కక్ష కట్టడంపై విమర్శలు వస్తున్నాయి.