Begin typing your search above and press return to search.
వస్తే డబ్బు... పోతే తృప్తి!
By: Tupaki Desk | 7 April 2015 6:33 AM GMTఆర్థిక లోటును అధిగమించుకునేందుకు ఏపీ ప్రభుత్వం రచిస్తున్న ప్లాన్స్ లో ఇప్పుడు భాగ్యలక్ష్మి లాటరీ వచ్చి చేరింది. ప్రస్తుతం ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆదాయం వచ్చే సులువైన మార్గాల కోసం అన్వేషణ మొదలుపెట్టిన క్రమంలో ప్రభుత్వం ఈ దిశగా లాటరీ ఆలోచన చేస్తుంది. ఒక వైపు రుణమాఫీలు, ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన జీతాలు మరో వైపు కేంద్రం సవతి ప్రేమ మధ్య బండిని నడపడం ప్రభుత్వానికి కత్తిమీద సాములా తయారయ్యింది. ఈ క్రమంలో సొంతంగానే ఆలోచన చేసి నిధులను సమకూర్చే పనిలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం. ఇందులో భాగంగానే వచ్చిన ఒక ఆలోచన భాగ్యలక్ష్మి లాటరీ!
రాజధాని నిర్మాణానికి నిధుల సేకరణలో భాగంగా లాటరీని ప్రారంభించాలని పార్టీ నేతలు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తెచ్చారు. గతంలో కూడా ప్రభుత్వం ఈ లాటరీని నిర్వహించేదని, మళ్లీ ఇప్పుడు అలాంటిదే ప్రవేశపెడితే బాగుంటుందని సలహా ఇచ్చారట. అయితే ఇందులో మరో లాజిక్ చెబుతున్నారు ఏపీ టీడీపీ నేతలు. ''లాటరీ తగిలిన వారికి డబ్బులస్తాయి, తగలనివారికి రాజధాని నిర్మాణానికి సొమ్ములు ఇచ్చామనే సంతృప్తి మిగులుతుంది'' అని చెబుతున్నారు! ఈ లాటరీ విధానం ద్వారా ప్రతీ ఏటా కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని బాబుకి చెప్పారట! అయితే ప్రస్తుతం ఈ అంశాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు సీఎం! ఈ క్రమంలో పరిశీలిస్తున్న హోం డిపార్ట్ మెంట్... ఈ లాటరీ వల్ల ఏడాదికి 12 వేల కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేస్తోందట! ఈ విషయాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సీఎం... కేబినెట్ సమవేశం జరిపిన తర్వాత అంతిమ నిర్ణయం ప్రకటిస్తారట!