Begin typing your search above and press return to search.

అవతరణ ఒకటిన.. విద్రోహం రెండున!

By:  Tupaki Desk   |   25 May 2015 12:21 PM GMT
అవతరణ ఒకటిన.. విద్రోహం రెండున!
X
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నవంబర్‌ ఒకటినే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జూన్‌ రెండో తేదీన తెలంగాణ మాత్రమే ఆవిర్భవించిందని, ఆంధ్రప్రదేశ్‌ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించింది మాత్రం నవంబర్‌ ఒకటినేనని తేల్చి చెప్పింది.

వాస్తవానికి, రాష్ట్ర ఆవిర్భావ దినం విషయంలో గత ఏడాది తీవ్ర గందరగోళం ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వం జూన్‌ రెండునే ఆవిర్భావ దినోత్సవం జరుపుతోంది. నవంబర్‌ ఒకటో తేదీని పూర్తిగా విస్మరించింది. అయితే, నవంబర్‌ ఒకటోతేదీని ఆవిర్భావ దినోత్సవం జరిపితే తెలుగుదేశం పార్టీకి ఒరిగేది రాజకీయంగా ఏమీ ఉండదు. జూన్‌ రెండో తేదీ అయితే కాంగ్రెస్‌ ద్రోహాన్ని గుర్తు చేసి జ్రల్లో సెంటిమెంటును మరింత రగిలించవచ్చు. తద్వారా రాజకీయంగా లాభపడవచ్చు. అందుకే చంద్రబాబు జూన్‌ రెండున నిర్వహించడానికే మొగ్గు చూపారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం నవంబరు ఒకటి నిర్వహించాలని పట్టుబట్టాయి. జూన్‌ రెండును ప్రజలు ఎంత తొందరగా మర్చిపోతా తమకు అంత మంచిదనేది వాటి ఆలోచన.

అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నవంబరు ఒకటినే జరపాలని తేల్చి చెప్పింది. బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ల నుంచి మూడు రాష్ట్రాలు విడిపోయినప్పుడు విడిపోయిన రాష్ట్రాలకు కొత్త తేదీ ఆవిర్భావ దినంగా ఉందని, పాత రాస్ట్రాలకు పాత తేదీయే ఉందని వివరించింది. దీనితో ఏపీ ్పభుత్వం డోలాయమానంలో పడింది. అయితే, నవంబర్‌ ఒకటో తేదీని ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించి.. జూన్‌ రెండో తేదీని కాంగ్రెస్‌ విద్రోహ దినంగా జరపాలనే డిమాండ్‌ ఇప్పుడు ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతోంది. అప్పుడు ప్రజలకు ఏపీ ఏర్పాటు గుర్తుంటుంది.. కాంగ్రెస్‌ ద్రోహం కూడా గుర్తుంటుందని వివరిస్తున్నారు.