Begin typing your search above and press return to search.

కుట్ర వివరాలు బయటపెట్టవచ్చుగా...

By:  Tupaki Desk   |   24 July 2015 5:11 PM GMT
కుట్ర వివరాలు బయటపెట్టవచ్చుగా...
X
గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో చోటు చేసుకున్న రెండు దుర్ఘటనల విషయంలో కుట్ర చోటుచేసుకుందని ప్రభుత్వమే వ్యాఖ్యానించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుట్ర చోటు చేసుకుందని టీడీపీ నాయకులో మరొకరో చెబితే అర్థం ఉంటుందని, కానీ ప్రభుత్వంలో భాగమైన మంత్రులు చెబితే ఎలాగని నిలదీస్తున్నారు. ఒకవేళ కుట్ర ఉందని భావిస్తే దానికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తున్నారు.

వాస్తవానికి, గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్ లో తొక్కిసలాట జరిగిన రోజు సాయంత్రమే టీడీపీకి చెందిన కొంతమంది సానుభూతిపరులు దానిలో కుట్ర కోణాన్ని చూశారు. అక్కడ విద్యుత్తు షార్టు సర్క్యూటు జరిగిందనే ప్రచారం జరిగిందని, దాంతో భక్తుల్లో ఆందోళన మొదలైందని, దాంతో వారంతా తలోదిక్కుకూ పరుగులు తీశారని అప్పుడే తొక్కిసలాట జరిగిందని ఆరోజే చెప్పారు. అయితే, ఆరోజు పరిస్థితిని బట్టి వారంతా దానిని గంటాపథంగా చెప్పలేకపోయారు. ఇక, బుధవారం సిలిండర్ పేలుడు వ్యవహారం కూడా అనుమానాస్పదంగా ఉండడంతో ప్రభుత్వానికి కూడా కాస్త అనుమానం వచ్చింది. దీనితోపాటు తొక్కిసలాట సందర్భంగా కూడా ఏదో జరిగిందనే అనుమానాలు బలపడ్డాయి.

అయితే, పుష్కర ఘాట్ తోపాటు రాజమండ్రిలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే ప్రకటించింది కూడా. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా అపశ్రుతి చోటుచేసుకుంటే ఆ విషయం తప్పనిసరిగా సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయి ఉంటుంది. ప్రభుత్వంలోనిమంత్రలులు అయినా మరొకరు అయినా వాటి ఆధారాలను బయటపెట్టాలి. తప్పితే ఇలా అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదనే వాదనలు వస్తున్నాయి.