Begin typing your search above and press return to search.
ఇద్దరు చంద్రుళ్ల దోస్తీకి ఇబ్బంది వస్తోందా..?
By: Tupaki Desk | 17 Nov 2015 9:49 AM GMTఅమరావతి శంకుస్థాపనతో చేతులు కలిపిన ఇద్దరు చంద్రుళ్ల మధ్య మళ్లీ ఎడం పెరగనుందా... రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చిక్కులు వారిద్దరి మధ్య మళ్లీ చిచ్చు రేపే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వరుస వివాదాలు ఏర్పడుతుండడంతో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య దోస్తీకి మళ్లీ దెబ్బపడొచ్చని అంతా భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అప్పుల పంపిణీపై ఓ వైపు వివాదం నడుస్తుండగా నీటి వనరులపైనా మరోసారి వివాదమేర్పడింది.
తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెంచటంపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. ఇది పునర్విజన చట్టంలోని మార్గదర్శకాలను ఉల్లంఘించటమేనని, దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఇదే విషయమై కేంద్ర జలసంఘం ఛైర్మన్ కు - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి ఏపీ జల వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి వారం రోజుల క్రితం లేఖ రాశారు. ఇందులో వారు పలు అంశాలను ప్రస్తావించారు. కృష్ణా జలాలకు సంబంధించి అనేక అంశాలు సుప్రీం కోర్టు - కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ 2 - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు - కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏపీ పైన ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొన్నారు.
అయితే... ఏపీ రాసిన లేఖలను ఫిర్యాదులుగా పరిగణిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మండిపడుతున్నట్లు సమాచారం. పైగా కల్వకుర్తి ఎత్తిపోతలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఏమాత్రం పట్టువీడరాదని టీ ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదాస్పద వాతావరణం తలెత్తవచ్చని భావిస్తున్నారు. ఇది ఇద్దరు చంద్రుళ్ల మధ్య మైత్రి పైనా ప్రభావం చూపినా చూపించవచ్చని అనుకుంటున్నారు.