Begin typing your search above and press return to search.
గుంటూరు టీడీపీ ఆఫీసును కూల్చేయనున్నారా?
By: Tupaki Desk | 4 July 2019 5:01 AM GMTప్రత్యర్థిని దెబ్బ తీయాలి. అదెలా ఉండాలంటే మళ్లీ కోలుకోలేని రీతిలో. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు ఎత్తులు.. పై ఎత్తులు వేసుకొని దెబ్బ తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటివేళ.. అందుకు భిన్నంగా తన ప్రత్యర్థి చేసే తప్పుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని వారిని ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు తెలుగు తమ్ముళ్లలో వణుకు పుట్టిస్తోంది.
నీతిగా.. నిజాయితీగా పని చేస్తే ఎలా ఉంటుందో చేతల్లో చేసి చూపిస్తున్న జగన్ సర్కార్ కారణంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటికి మొన్న బాబు హయాంలో రూ.8 కోట్లు ఖర్చు చేసి మరీ నిర్మించిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమని తేలటంతో.. దాన్ని మొదలుకంటా కూల్చేయటం ద్వారా అక్రమ నిర్మాణాల విషయంలో తామెంత కఠినంగా ఉంటామన్న విషయాన్ని చెప్పేసింది జగన్ సర్కారు.
ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇప్పటివరకు టీడీపీ అధినేత అద్దెకు ఉంటున్న భవనం అక్రమ కట్టడమన్న విషయం తెలిసిందే. తాజాగా.. గుంటూరులోని ఏపీ టీడీపీ హెడ్డాఫీసు కూడా మాయా ఆఫీసుగా అభివర్ణిస్తున్నారు. షాకింగ్ విషయం ఏమంటే.. భారీగా ఉండే ఈ భవనం ఒకటి ఉన్నట్లుగా అధికారిక రికార్డుల్లో లేదన్న నిజం తాజాగా బయటకు వచ్చింది.
గుంటూరు అరండల్ పేటలో వెయ్యి గజాల కార్పొరేషన్ స్థలాన్ని టీడీపీ హెడ్డాఫీసు నిర్మాణం కోసం 1999లో 30 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. ఏటా రూ.25వేల చొప్పున నగరపాలక సంస్థకు అద్దె చెల్లించేలా.. మూడేళ్లకోసారి లీజును రెన్యువల్ చేసేలా.. 33 శాతం అద్దె పెంచేలా ఒప్పందం చేసుకున్నారు. ఇంతవరకూ ఓకే అనుకున్నా.. లీజుకు తీసుకున్న భవనం పక్కనే ఉన్న 1637 గజాల కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించుకొని.. తమ ఆధీనంలోకి తీసుకొని మూడు అంతస్తుల భారీ భవనాన్ని నిర్మించారు.
గుంటూరు జిల్లా కార్యాలయంగా ఉన్న ఈ భవనాన్ని 2014లో పవర్ లోకి రాగానే.. దాన్ని ఏపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంగా మార్చేశారు. 20 ఏళ్లుగా సదరు భవనానికి అనుమతి లేకుండా.. రూపాయి పన్ను చెల్లించకుండా పార్టీ ఆఫీసును నిర్వహిస్తున్న తీరు తాజాగా బయటకు వచ్చింది. లీజుకు తీసుకున్న స్థలాన్ని మూడేళ్లుగా రెన్యువల్ చేసుకోకపోవటం ఒక ఎత్తు అయితే.. పక్కనే ఉన్న కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా పెట్టేసి.. పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన వైనం తాజాగా బయటకు వచ్చింది. రికార్డుల్లో ఈ భవనం గురించి సమాచారం లేదన్న కొత్త విషయం బయటకు వచ్చింది.
మరిలాంటివేళ.. ప్రజావేదిక మాదిరే చర్యలు తీసుకుంటే.. ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యాలయం కూల్చాల్సిందే. అయినా.. ఇంత దారుణంగా.. గుడ్డిగా..ఎలాంటి అనుమతులు లేకుండా భవనాన్ని ఎలా కట్టేసినట్లు? ప్రత్యర్థులకు జట్టు అందేలా వ్యవహరించే తీరు చూస్తే.. టీడీపీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉందో ఇట్టే అర్థం కాక మానదు.