Begin typing your search above and press return to search.

అప్పుడే శ్లాబుల దగ్గరకు వెళ్లిపోయారా?

By:  Tupaki Desk   |   9 April 2016 8:18 AM GMT
అప్పుడే శ్లాబుల దగ్గరకు వెళ్లిపోయారా?
X
మాటలు చెప్పే రోజులు పోయాయి. తాను చెప్పినవన్నీ చేతల్లో చూపించాల్సిన సమయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆసన్నమైంది.ఆ విషయాన్ని ఆయన గుర్తించినట్లున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఇదే విషయం అర్థమవుతుంది. ఏపీ ప్రజలు తన మీద ఏ నమ్మకాన్ని పెట్టుకొని అధికారాన్ని అప్పజెప్పారో.. ఆ పని మీద పూర్తి ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది తాజాగా చంద్రబాబు తీరు చూస్తుంటే.

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ నాటికి పూర్తి చేయాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. ఫిబ్రవరి 17న తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి సంబంధించిన శంకుస్థాపన చేయగా.. తాజా ఆ నిర్మాణ పనుల్ని చూస్తే.. పనులెంత ఫాస్ట్ గా సాగుతున్నాయో తెలుస్తుంది. రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే ఫస్ట్ శ్లాబ్ వద్దకు పనులు చేరుకున్నాయి.

తాత్కాలిక సచివాలయ నిర్మాణ కాంట్రాక్ట్ ను దక్కించుకున్న ఎల్ అండ్ టీ.. షాపూర్జీ పల్లోంజీలు వాయువేగంతో పనులు పూర్తి చేసేలా పని చేస్తున్నాయి. అనుకున్న సమయానికి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించాలన్న పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుతం సాగుతున్న పనుల స్పీడ్ చూస్తే.. ఏపీ సర్కారు అనుకున్నట్లే జూన్ నాటికి తాత్కాలిక సచివాలయం పూర్తి కావటం ఖాయంగా కనిపిస్తోందని చెప్పాలి. అదే జరిగితే.. ఏపీ ముఖ్యమంత్రి మాటల మనిషే కాదు.. చేతల్లో కూడా చేసి చూపిస్తారన్న మాట నిజమవుతుంది.