Begin typing your search above and press return to search.
మండలికి మంగళం.. ముహుర్తం కూడా పెట్టేశారా?
By: Tupaki Desk | 16 Feb 2020 12:40 PM GMTప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని దుర్మార్గంగా.. అక్రమ పద్దతిలో అడ్డుకోవటం ఏ మాత్రం సరైన పని కాదు. కానీ..మంది బలం ఎక్కువగా ఉన్న చోట తమ తీరుతో మోకాలడ్డుతున్న ఏపీ మండలి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ అసెంబ్లీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని అధిక్యత ఉంటే.. మండలిలో టీడీపీకి బలముంది.
ఇలాంటివేళ.. ప్రభుత్వ నిర్ణయాల్ని అడ్డుకోవటం సరైన పని కాదు. కానీ.. మండలి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇలాంటివేళ.. మండలి తీరుతో విసిగిన ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మండలిని మూసివేయాలని నిర్ణయం తీసుకోవటమే కాదు.. అసెంబ్లీలో అందుకు తగ్గ నిర్ణయాన్ని తీసేసుకున్నారు.
మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం కేంద్రం వద్దకు వెళ్లింది. అక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత కానీ మండలి మూసివేత ప్రక్రియ పూర్తి కాదు. ఇదిలా ఉంటే.. ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు.. కేంద్రహోంమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య మండలి రద్దు అంశంపై చర్చ వచ్చినట్లు తెలుస్తోంది. మండలి రద్దుపై అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని జగన్ ప్రస్తావించగా.. మోడీషాలు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని చెబుతున్నారు.
మోడీ వద్ద మండలి రద్దు గురించి ప్రస్తావించినప్పుడు.. ఇదే అంశాన్ని అమిత్ షాతో చర్చించాలని చెప్పటంతోనే జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. నలబై నిమిషాల భేటీలో జగన్ ప్రస్తావించిన అంశాలపై షా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. మండలి మూసివేతకు అవసరమైన అంశాల్ని చర్చించేందుకు ఒకసారి న్యాయశాఖామంత్రిని కలవాలన్న సూచనతోనే.. షెడ్యూల్ లో లేనప్పటికీ కేంద్రమంత్రిని కలిసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే నెలలో మండలి రద్దుపై కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకునే వీలుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలైనట్లుగా తెలుస్తోంది.