Begin typing your search above and press return to search.
ఆంధ్ర రేస్ కోర్సు కు రెడీ..
By: Tupaki Desk | 6 Sep 2015 9:28 AM GMT ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సొంతంగా రేస్ కోర్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ రేస్ కోర్స్ వల్ల వస్తున్న ఆదాయం ఎపికి రాబట్టుకునేందుకు వీలుగా చట్టంలో తెలంగాణ అని ఉన్న పేరును ఆంధ్రప్రదేశ్ గా మార్పు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనసభ సభలో ఆమోదించిన సంగతి తెలిసిందే... దీంతో పాటు ఎపిలోనే ఒక రేస్ కోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీన్ని కొత్త రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయానుకుంటున్నారు.
రాష్ట్రంలోని అనేక మంది రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ రేస్ క్లబ్ లో సభ్యులుగా ఉన్నారు. వారిలో కొందరు ఎపిలో రేస్ క్లబ్ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసిరది. ఇందుకు వారు ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించినట్లు తెలిసింది. సాధారణంగా రేస్ క్లబ్ ఏర్పాటుకు కనీసం వంద నుంచి 150 ఎకరాల స్థలం అవసరమవుతుంది. ఈ భూమిని లీజు పద్ధతిలో క్లబ్ కు ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ రేస్ క్లబ్ ఆధ్వర్యంలోనే రెండు రాష్ట్రాలోన్లూ ప్రస్తుతం బెట్టింగులు నడుస్తున్నాయి. విశాఖపట్నం సహా ఏపీలోని ఇతర ప్రాంతాల్లో సాగే బెట్టింగుల ఆదాయం నేరుగా హైదరాబాద్ లోని మలక్ పేటలోని రేసుకోర్సు విభాగానికే చెందుతోంది. తెలంగాణ నుంచి ఏటా దాదాపు రూ. 68 కోట్లు, ఏపీ నురచి రూ. 16 కోట్లు బెట్టింగు ఆదాయం వస్తోంది. బెట్టింగులో ప్రవేశ రుసుముపై 35 శాతం పన్ను, వసూలైన మొత్తం పైన పన్ను, బెట్టింగు పన్ను ద్వారా చెరో 15 శాతం ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. అందుకే ఎపి ఆదాయం ఎపీకే దక్కేలా చట్టంలో సవరణ చేశారు.
ఎపి నుంచి బెట్టింగు ఆదాయం వసూలు బాధ్యతలను విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించనున్నారు. హైదరాబాద్ రేస్ కోర్స్‌కు అనుబంధంగానే ఎపిలో ఒక రేస్ కోర్స్ ఏర్పాటు చేయాలా, లేక సొంతంగానేనా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్ రేస్ కోర్స్ యాజమాన్యం విడిగా ఏపీలో రేస్ కోర్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే ఆ ప్రతిపాదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలనుకుంటున్నారు.