Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ అడ‌గ‌ట‌మే ఆల‌స్యం స‌ర్కారు రెడీ

By:  Tupaki Desk   |   29 Jun 2017 10:38 AM GMT
ముద్ర‌గ‌డ అడ‌గ‌ట‌మే ఆల‌స్యం స‌ర్కారు రెడీ
X
కాపు రిజ‌ర్వేష‌న్ల నేత ముద్రగడ పద్మనాభం త‌ల‌పెట్టిన పాద‌యాత్ర విష‌యంలో ఏపీ స‌ర్కారు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. వ‌చ్చే జులై 26 నుంచి తలపెట్టిన పాదయాత్రకు ఇప్ప‌టికే రూట్ మ్యాప్‌ ను సైతం ముద్ర‌గ‌డ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టివ‌ర‌కు ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌కు అనుమతి లేదని తేల్చిచెప్పిన హోంమంత్రి చినరాజప్ప తాజాగా కాస్త సడ‌లింపు ఇచ్చారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన హోం మంత్రి - ఉప‌ముఖ్య‌మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ముద్ర‌గ‌డ ఉద్దేశ‌పూర్వ‌క చ‌ర్య‌లు స‌రికాద‌ని అన్నారు. అనుమతి లేకపోయినా రూట్‌ మ్యాప్‌ ప్రకటించడం ముద్రగడకు అలవాటేనని విమర్శించారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి కోరితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చినరాజప్ప పేర్కొన్నారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేరిస్తే తనకు క్రెడిట్‌ దక్కదనే ముద్రగడ ఇలాంటి వాటికి పాల్పడుతుంటారని ఎద్దేవా చేశారు.

కాగా, త‌మ‌ ముద్ర‌గ‌డ రూట్ మ్యాప్‌ ను ఇటీవ‌లే విడుద‌ల చేశారు. త‌మ పాద‌యాత్ర‌ను మొత్తం నాలుగు జిల్లాల పరిధిలో 116 గ్రామాల మీదుగా పాదయాత్ర జరిగేలా షెడ్యూలును రూపొందించామని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తెలిపారు. కిర్లంపూడిలో జూలై 26న ప్రారంభించే యాత్ర వీరవరం - జగ్గంపేట మీదుగా మొత్తం 22 గ్రామాల మీదుగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌ కు చేరుకుంటుందన్నారు. అక్కడ నుంచి రోడ్ కం రైలు బ్రిడ్జి మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించి 53 గ్రామాల్లో సాగుతుందన్నారు. అన్ని జిల్లాల్లోని కాపు కుల‌స్తులు త‌మ‌తో క‌లిసి వ‌చ్చేందుకు ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నార‌ని ముద్ర‌గ‌డ వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/