Begin typing your search above and press return to search.
టీడీపీ, వైసీపీకి అసలు సవాల్ రెడీ అవుతోంది
By: Tupaki Desk | 5 July 2016 4:26 PM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల రూపంలో రాజకీయ పార్టీల మధ్య మినీ సంగ్రామం జరుగనున్నది. రాష్ట్రంలోని 11 మున్పిపల్ కార్పొరేషన్లు - మున్సిపాలిటీలకు చోట్ల జరిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్టు మాసంలోగా ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలటీలలో ఓటర్ల గణన - రిజర్వేషన్ల ఖరారు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నారు. తాజా ఆదేశాల ప్రకారం ఆయా జిల్లాల యంత్రాంగం కూడా ఓటర్ల జాబితా రూపొందించటంలో తలమునకలై ఉండటం విశేషం.
ఎన్నికల నిర్వహణ గురించి ఇటీవలే న్యాయస్ధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఓటర్ల జాబితా రూపొందుతోందని - దాని తర్వాత రిజర్వేషన్ల ఖరారు కాగానే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంటామని ప్రభుత్వం న్యాయస్ధానంలో చెప్పింది. దాని ప్రకారమే కసరత్తు మొదలుపెట్టింది. తిరుపతి - కర్నూలు - విశాఖపట్నం - ఒంగోలు - కాకినాడ - గుంటూరు కార్పొరేషన్లతో పాటు కందుకూరు - రాజంపేట - రాజాం - నెల్లిమర్ల - శ్రీకాకుళం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో భాగంగానే అధికార పార్టీ తెలుగుదేశం కూడా అభ్యర్ధుల ఎంపిక విషయమై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఎన్నికలు జరుగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలున్న జిల్లాల నాయకత్వంతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. ఆయా జిల్లాల మంత్రులు - ఇన్ ఛార్జ్ మంత్రులు - సదరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎల్ ఏలు లేదా నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లతో కూడా సమావేశమైనట్లు తెలిసింది.
ఇక, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా జరుగనున్న ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. రెండేళ్ళ క్రితం జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికా జరగలేదు. స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికల సమయంలోనే జరిగిపోవటంతో అధికార పార్టీ పనితీరుపై ప్రజా స్పందన తెలియలేదు. అదేవిధంగా, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పనితీరుపైన కూడా ప్రజల్లో ఉన్న అంచనాలు తెలుసుకునే అవకాశం రాలేదు. ఇపుడు మున్సిపల్ ఎన్నికల రూపంలో రెండు పార్టీలకు విషమ పరీక్ష ఎదురవ్వబోతున్నది. పైగా ఎన్నికలు కూడా దాదాపు 8 జిల్లాల్లోనూ జరుగనున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరులోని తిరుపతి - కర్నూలు జిల్లాలోని కర్నూలు - విశాఖపట్నం జిల్లాలోని విశాఖ కార్పొరేషన్ - ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్ - తూర్పు గోదావరి జిల్టాలోని కాకినాడ - గుంటూరు జిల్లాలోని గుంటూరు కార్పొరేషన్ కు ఎన్నిక జరగాలి. అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని కందుకూరు మున్పిపాలిటీ - కడప జిల్లాలోని రాజంపేట - శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నగర పంచాయితీ - శ్రీకాకుళం మున్పిపాలిటీ - విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మున్పిపాలిటీకి ఎన్నిక జరగాలి. ఈ విధంగా 8 జిల్లాలో ఎన్నికలు జరపటానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నందున జరగబోయే ఎన్నికలు ఒక విధంగా మినీ సంగ్రామమేనని అంటున్నారు.
గడచిన రెండేళ్ళలో అధికార తెలుగుదేశం పార్టీ అమలు చేసిన రైతు - డ్వాక్రా - చేనేత రుణాల మాఫీ తీరు - అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలైన ఫించన్ల ప్రభావం - వివిధ పండగల సందర్భంగా చంద్రన్న పేరుతో నిత్యావసరాల రూపంలో పంచుతున్న తాయిలాలపై టీడీపీ భరోసాగా ఉంది. ఎంఎల్ఏల ఆకర్ష్ పథకం - ఇసుక రీచ్ ల నిర్వహణ - ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వైఖరి - రాజధానిగా అమరావతిని ఎంపిక చేయటం - విభజన ప్రయోజనాలను రాబట్టే విషయంలో సీఎం అనుసరిస్తున్న విధానాలు లాంటి అనేక అంశాలు - రాజధాని నిర్మాణం ముసుగులో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్న వైనంతో పాటు అనేక అంశాలలో రెచ్చిపోతున్న టీడీపీ నేతల వైఖరి లాంటివి ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ సిద్ధం అవుతోంది. ఇప్పటికే అధికార - ప్రతిపక్షాలపై ఆయా అంశాల్లో ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడే ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తంగా ఈ మినీ సంగ్రామం ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకమే కాదు భవిష్యత్ నిర్దేశకం కూడానని అంటున్నారు.