Begin typing your search above and press return to search.

జ‌గన్ ప‌రామ‌ర్శించాడ‌ని పించ‌న్ తీసేశారు

By:  Tupaki Desk   |   2 March 2017 4:53 AM GMT
జ‌గన్ ప‌రామ‌ర్శించాడ‌ని పించ‌న్ తీసేశారు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ క‌క్ష‌పూరిత‌ చ‌ర్య‌ల‌పై వివిధ వ‌ర్గాల నుంచి తీవ్ర‌ విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రాజ‌కీయాల్లో త‌ప్పు-ఒప్పులు ఎంచ‌డం స‌హ‌జం అయిన‌ప్ప‌టికీ తెలుగుదేశం పార్టీ నేత‌లు ఈ మౌళిక ఉద్దేశాన్ని వ‌దిలేశార‌ని అంటున్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా ఇబ్బందులు పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ఆఖ‌రికి వృద్ధులు - వితంతువులను కూడా వ‌దిలిపెట్ట‌డం లేద‌ని తెలుస్తోంది. తాజాగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించినందుకు ఓ వృద్ధురాలి పెన్ష‌న్ తీసివేయ‌డం గ‌మ‌నార్హం. అనంత‌పురం జిల్లాలో ఈ ప‌రిణామం జ‌రిగింది.

ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామానికి చెందిన రైతు పండ్ల సత్యనారాయణ కుటుంబానిది ఈ దీన గాథ‌. స‌త్య‌నారాయ‌ణ‌ తనకున్న 8 ఎకరాల్లో పంటలు సాగు చేశాడు. రెండుసార్లు అరటి పంట వేసినా తీవ్ర నష్టం రావడం, రూ.2.50 లక్షలు ఖర్చు చేసినా చుక్క నీరు పడలేదు. సుమారు రూ.8 లక్షలు అప్పు భారంగా మారింది. ఆత్మహత్యే శరణ్యమైంది. దీంతో ఆయ‌న 2015 లో బలవన్మరణం పాలయ్యాడు. అతని పెద్ద కుమారుడు సూర్యనారాయణ బెంగళూరులో ఉంటున్నాడు. రెండో కొడుకు రామాంజనేయులు ట్రాక్టర్ మెకానిక్‌ గా కడపలో స్ధిరపడ్డాడు. చిన్న కొడుకు నారాయణస్వామి ఊర్లోనే రూ.2.50 లక్షలు ప్రైవేటు ఫైనాన్స్‌ లో అప్పు తీసుకుని ఆటో నడుపుకుంటూ తల్లిని రామేశ్వరమ్మను చూసుకుంటున్నాడు. ఆమె చిన్న టీ దుకాణం పెట్టుకుని బతుకీడుస్తోంది. ఇప్పటికి ఆమెకు కేవలం 3 ఎకరాల భూమి మిగిలింది. ఒక్క బోరులో అరకొరగా నీరోస్తోంది. రూ.4 లక్షలు అప్పు మిగిలింది. అలాంటి వ్య‌క్తి పించ‌న్‌ ను జ‌గ‌న్ ప‌రామ‌ర్శించిందినందుకు తొల‌గించారు.

త‌న‌కు జ‌రిగిన సంఘ‌ట‌న గురించి రామేశ్వ‌ర‌మ్మ ఆవేద‌న‌తో మీడియాతో గోడు వెల్ల‌బోసుకుంది. ‘నా భ‌ర్త‌ మరణానంతరం నాకు వృద్ధాప్య పెన్షన్ తీసేశారు. జగన్ మమ్మల్ని పరామర్శించాడని ప్రభుత్వం కక్ష సాధించింది. ఎన్నిసార్లు అర్జీలిచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ఉపాధి హామీ పథకం కింద పెట్టిన మామిడి చెట్ల బిల్లులు రూ.లక్ష దాకా ఎగ్గొట్టారు. ఎందుకు ప్ర‌భుత్వం ఇలా చేస్తోంది?’ అని రామేశ్వరమ్మ వాపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/