Begin typing your search above and press return to search.

వెలిగొండ రివర్స్ టెండరింగ్..రూ. 62.1 కోట్ల ఆదా!

By:  Tupaki Desk   |   20 Oct 2019 4:24 AM GMT
వెలిగొండ రివర్స్ టెండరింగ్..రూ. 62.1 కోట్ల ఆదా!
X
తెలుగుదేశం హయాంలో కొంతమంది కాంట్రాక్టర్లకు ధారాదత్తం చేసిన పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ విషయంలో దూకుడుగా కొనసాగుతూ ఉంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఆర్థిక వ్యవస్థకు భారీ భారాన్ని తగ్గించింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నల్ టు విషయంలో కూడా రివర్స్ టెండరింగ్ ప్రకియ చేపట్టారు.

ఇందులో ప్రభుత్వ ఖజానాకు రూ. 62.1 కోట్ల రూపాయల వరకూ మిగిలిందని తెలుస్తోంది. గతంతో పోలిస్తే కాంట్రాక్టు వ్యయం ఏడు శాతం వరకూ తగ్గిందని అంచనా. మెయిల్ గ్రూప్ ఈ కాంట్రాక్టును పొందింది. మొత్తం వ్యయాన్ని మూడు శాతం వరకూ తగ్గించి ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ ఇచ్చింది. అంతకన్నా నాలుగు శాతం తక్కువ వ్యయాన్ని కోట్ చేసి - మెయిల్ ఈ ప్రాజెక్టును పొందింది. గతంలో ఈ కాంట్రాక్ట్ విలువ దాదాపు ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయల వరకూ ఉంది. రివర్స్ టెండరింగ్ అనంతరం మొత్తం నాలుగు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలకు తగ్గింది.

ఇలా ప్రభుత్వ ఖజానాకు దాదాపు అరవై రెండు కోట్ల రూపాయల భారం తగ్గింది. ప్రజధనాన్ని అడ్డగోలుగా కాంట్రాక్టర్లకు కట్టబెట్టే పరిస్థితిని నివారించడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టి.. మొత్తం కాంట్రాక్టులను పునఃసమీక్షిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.