Begin typing your search above and press return to search.
రిలయన్స్ కి ఇచ్చిన భూములు వెనకకు తీసుకుంటుందా?
By: Tupaki Desk | 9 Feb 2020 4:51 AM GMTచంద్రబాబు ప్రభుత్వంలో దేశవిదేశాల పారిశ్రామిక సంస్థలతో వందల ఎంవోయులు జరిగాయి. వందలాది పరిశ్రమలు ఏపీకి తరలివస్తున్నాయని బాబు గారు డబ్బా కొట్టుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఉపాధి - ఉద్యోగ అవకాశాలు వస్తాయని చాటింపు వేశారు. ఆయా పరిశ్రమలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. వందల ఎకరాలను ధారాదత్తం చేశారు. కానీ ఒక్క సంస్థ కూడా పరిశ్రమలు స్థాపించలేదన్న విమర్శలున్నాయి. ఆ భూములను అలాగే వదిలేయడంతో అటు రైతులు సాగు చేసుకోలేక..ఇటు సంస్థలు పరిశ్రమలు పెట్టలేకే.. పేదలకు ఉపయోగపడకుండా పడి ఉన్నాయి. చంద్రబాబుగారి హయాంలో ఏపీలో పరిశ్రమల తీరుపై తాజాగా వైసీపీ ప్రభుత్వం సమీక్షిస్తోంది.
చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ముందుకొచ్చింది. దేశంలోనే అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకొని రెండు ప్రాజెక్టులను చేపడుతానని ఒప్పందం చేసుకున్నారు. తిరుపతి సమీపంలోని రేణిగుంటలో రిలయన్స్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తి పరిశ్రమతో పాటు కాకినాడ సముద్ర తీరంలో సహజవాయువు వెలికితీసేందుకు రెండు పరిశ్రమల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చింది..
అయితే ఆ తర్వాత ఎన్నికలు జరగడం.. చంద్రబాబు దిగిపోవడం.. జగన్ గద్దెనెక్కడంతో ఈ పరిశ్రమల ఏర్పాటులో జాప్యం జరిగింది. తాజాగా ఆ రెండు ఒప్పందాల్లో ఒకటిని రిలయన్స్ రద్దు చేసుకున్నట్టు పచ్చమీడియాలో వార్తలు వచ్చాయి.. దీన్ని బేస్ చేసుకొని వైసీపీ సర్కారును అభాసుపాలు చేసేందుకు చంద్రబాబు - ఆయన అనుంగ మీడియా కట్టుకథలు అల్లి ప్రచారం చేసింది. అయితే ఇదంతా అబ్ధమని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని దినపత్రికలలో అదాని - రిలయన్స్ సంస్థలు వెనక్కి వెళుతున్నాయంటూ వచ్చిన వార్తల ప్రచారం వాస్తవం కాదని మేకపాటి ఈ మధ్యనే వివరణ ఇచ్చారు. రిలయన్స్ సంస్థకు గత ప్రభుత్వం కేటాయించిన భూములు కోర్టు కేసులో ఉన్నందున ఏపీఐఐసీ ద్వారా ప్రత్యామ్నాయ భూములు కేటాయించనున్నామని తెలిపారు. అందుకే రిలయన్స్ పరిశ్రమ ఏర్పాటులో కోర్టు కేసుల వల్లే జాప్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు.
రిలయన్స్ సంస్థ ఎక్కడికీ వెళ్లదని వైసీపీ ప్రభుత్వం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో భిన్నమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో రిలయన్స్ సంస్థకు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకునేందుకు తిరుపతి అర్బన్ తహసీల్దారు జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాల కింద ఈ భూములను కేటాయించాలని ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిని కలెక్టర్ ఆమోదిస్తే రిలయన్స్ కు కేటాయించిన 60.26 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ద్వారా తిరిగి వెనక్కి తీసుకోవడం లాంఛనప్రాయమే అవుతుంది. అయితే ప్రభుత్వం వద్దంటున్నా క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రయత్నిస్తున్నారా? వెనక్కి తీసుకుంటున్నారా? రియలన్స్ కు వేరే భూములు ఏమైనా ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది.