Begin typing your search above and press return to search.
జగన్ ను ప్రభుత్వం వెంటాడుతోందా?
By: Tupaki Desk | 22 Jun 2016 6:48 AM GMTఅక్రమాస్తుల కేసుల్లో ఇప్పటికే పీకల్లోతు ఇరుక్కుపోయిన వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికార తెలుగుదేశం పార్టీ నుంచి మరో కష్టం ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించాడన్న ఆరోపణలపై సిబిఐ కేసులున్న జగన్‌ను వెంటాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సిబిఐ పెట్టిన కేసులను త్వరితగతిన విచారణ చేసేందుకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రాష్ట్రపతి అనుమతి కూడా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జగన్ ఆస్తులను స్వాధీనం చేసు కునేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ ను కూడా తీసుకు వచ్చేందుకు ఇంతకుముందు హడావుడి చేసింది. ఇందులో భాగంగానే దేశ - విదేశాల్లో జగన్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపై ఇప్పుడు దృష్టి సారించింది. విదేశాల్లోని కొంత మంది ప్రవాస భారతీయులతో జగన్ ఆస్తులకు సంబంధించి ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.
ఏపి నూతన రాజధాని భూ సమీరణలో పలు అక్రమాలు జరిగాయంటూ వైసిసి నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధికార పక్షం జగన్‌ను లక్ష్యంగా చేసుకుంది. సిఎం చంద్రబాబు - కొద్ది మంది మంత్రులు రాజధాని ప్రాంతంలో భూము లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని కూడా వైసిపి నేతలు ఆరోపించారు. చంద్రబాబుకు సింగపూర్ లో హోటళ్లు - పలు వ్యాపారాలు ఉన్నాయని వేదికలెక్కిపెద్ద పెట్టుకున్న కేకలు పెట్టారు. తమ ప్రభుత్వంపై విమర్శలు - ఆరోపణలు చేస్తున్న వైసిపి అధినేతకు బ్రేకులు వేసినట్టయితే మిగతా నాయకులు సైతం మౌనంగా ఉంటారని భావించిన ప్రభుత్వం ఆ దిశగా పావులు కదుపుతుంది. అందులో భాగంగానే... ఆస్ట్రేలియాలో జగన్ ఆస్తులు ఉన్నట్టు సమాచారం ఉండడంతో అక్కడికి ప్రత్యేకంగా ఓ బృందాన్ని పంపించారు. ఎక్కడెక్కడ ఏమేం ఆస్తులున్నాయో గుర్తించి ఆ వివరాలను ఇక్కడ బాగా ప్రచారం చేయాలన్న ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల్లోనూ ఆస్తులుంటే ఆ వివరాలూ సేకరించి అక్రమాస్తుల కేసులనూ బిగించాలన్నది చంద్రబాబు ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తే మొత్తం పార్టీ నేతలందరి నోళ్లు మూతపడతాయని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకుగాను ఇప్పటికే ప్రత్యేక బృందాలే కాకుండా ప్రయివేటు డిటెక్టివ్ ఏజెన్సీలనూ ఆశ్రయించినట్లుగా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.