Begin typing your search above and press return to search.
కత్తి పైన ఏపీలోనూ బహిష్కరణ తప్పదా?
By: Tupaki Desk | 9 July 2018 8:42 AM GMTసినీ విమర్శకుడిగా.. వివిధ అంశాల మీద టీవీ ఛానల్స్ కు రెడీమెడీగా దొరికే వారిలో కత్తి మహేశ్ ఒకరని చెబుతారు. కాస్త విషయంతో పాటు.. టీవీ వాళ్లకు కావాల్సినట్లుగా టైంను ఇవ్వగలిగిన ఆయన.. అవసరానికి తగ్గట్లు మసాలాను యాడ్ చేయటంలో మహా దిట్టగా టీవీ ఛానల్స్ లో పని చేసే జర్నలిస్టు మిత్రులు కొందరు లోగుట్టు మాటల్లో చెబుతుంటారు.
కత్తి పుణ్యమా అని.. వ్యూయర్ షిప్ పెంచుకోవటంలో కొన్ని ఛానళ్లు ఆయన్ను పెంచి పెద్ద చేశాయని.. అయితే.. అదంతా వారి ప్రయోజనం కోసమే తప్పించి మరింకేమీ లేదన్న విషయాన్ని కత్తి గ్రహించలేకపోయారని చెబుతారు.
తనకొచ్చిన ఇమేజ్ ను కత్తి సరిగా ఉపయోగించుకుంటే బాగుండేదని.. కానీ.. చేయకూడని తప్పును చేసినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. శ్రీరాముడిపై కత్తి చేసిన వ్యాఖ్యలు.. ఆయన్ను అభిమానించే వారికి సైతం ఆగ్రహాన్ని తెప్పించినట్లుగా చెప్పక తప్పదు.
గతంలో ఆయన టచ్ చేసిన ఏ సబ్జెక్ట్ మీద కూడా ఇంత వ్యతిరేకత వ్యక్తం కాలేదని.. శ్రీరాముడిపైన ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎప్పుడు దేవుళ్ల గురించి మాట్లాడని కొందరు సీనియర్ నేతలు సైతం రియాక్ట్ కావటం.. చర్యలు తీసుకోవాలనటం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ వేటు వేసినట్లుగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తాజాగా వెల్లడించారు.
ఆయన్ను ఏపీ పోలీసులకు అప్పజెప్పినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ లో నగర బహిష్కరణ విధించిన నేపథ్యంలో ఏపీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కత్తిపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కత్తి మహేశ్ జంతువులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ వారు.. తెలుగు రాష్ట్రాల్లో మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
కులం అడ్డుపెట్టుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటున్న బ్రాహ్మణ సంఘాలు.. కత్తిని ఏపీ నుంచి కూడా బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. స్వామి పరిపూర్ణానంద యాత్రను అడ్డుకోవటం సరికాదంటున్న బ్రాహ్మణ సంఘాలు ఏపీ సర్కారును కూడా కత్తిపై బహిష్కరణ వేటు వేయాలని కోరటంతో బాబు సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏపీలో కూడా కత్తిపై బహిష్కరణ వేటు వేసే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. అక్కడి పోలీసు ఉన్నతాధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.