Begin typing your search above and press return to search.
రాజధాని రైతుకు శంకుస్థాపన బట్టలొచ్చేశాయి
By: Tupaki Desk | 13 Oct 2015 4:21 AM GMTఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణం కోసం తమ భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు శంకుస్థాపన సందర్భంగా బట్టలు పెట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఏపీ సర్కారు భావిస్తోంది.
ఇందులో భాగంగా భూమి ఇచ్చిన ప్రతి రైతు కుటుంబానికి చీర.. జాకెట్టు.. పంచె.. కండువాను ఇచ్చేందుకు ప్రభుత్వం రెఢీ అవుతోంది. ఇందుకు అవసరమైన బట్టల్ని సిద్ధం చేశారు. ఒక్కో రైతు కుటుంబానికి ఇచ్చే వస్త్రాల విలువ రూ.2400 వరకు అవుతుందని.. అప్కో ఇచ్చిన డిస్కౌంట్ తో రూ.1600లకే లభించాయని చెబుతున్నారు.
ప్రభుత్వం కోరిన మీదట బట్టలతో పాటు.. కవర్లను కూడా అఫ్కో సిద్ధమైంది. రైతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన వస్త్రాల్ని ఒకచోటకు చేర్చిన అధికారులు.. వాటిని ప్యాక్ చేసేందుకు వీలుగా కవర్ల కోసం ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయానికి చేరుకోవాల్సి ఉంది. సోమవారం అమావాస్య కావటంతో.. మంగళవారం కవర్లు వచ్చిన వెంటనే వస్త్రాల ప్యాకింగ్ మొదలు పెట్టనున్నారు.
ప్యాకింగ్ చేసిన వస్త్రాల్ని బుధవారం నుంచి పంపిణీ చేయటం మొదలు పెడుతున్నారు. రైతులకు ఇస్తున్న వస్త్రాలకు సంబంధించి నాణ్యతకు పెద్దపీట వేసిన మాట వినిపిస్తోంది. ఇక.. బట్టల్ని పెట్టి ఇచ్చే కవర్ మీద టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బొమ్మను ప్రింట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేయి ఎత్తి అభివాదం చేస్తున్న బొమ్మను కూడా ప్రింట్ చేశారు.
‘‘నూతన రాజధాని శంకుస్థాపన మహోత్సవానికి ఆత్మీయ ఆహ్వానం.. 22-10-2015 సమయం ఉదయం 10 గంటలకు.. వేదిక ఉద్దండరాయుని పాలెం’’ అని ముద్రించారు. కవరు వెనుక వైపు మాత్రం మాస్టర్ ప్లాన్ లోని డౌన్ టౌన్ చిత్రాన్ని ముద్రించారు. భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇస్తున్న వస్త్రాల కోసం ఏపీ సర్కారు రూ.3.84కోట్లు ఖర్చు చేయనుంది. వాస్తవానికి వీటి విలువ రూ.5.76కోట్లు అయితే.. డిస్కౌంట్ ఇవ్వటంతో దాదాపు రూ.1.9కోట్లు ఆదా అయ్యిందని చెబుతున్నారు.