Begin typing your search above and press return to search.
ట్యాపింగ్ విచారణ సా..గుతోంది
By: Tupaki Desk | 22 Jun 2015 1:38 PM GMTఏపీకి చెందిన 120 మంది ముఖ్యులకు సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్ చేశారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఏపీ సర్కారు ఆరోపించటం తెలిసిందే. ఓటుకు నోటు వ్యవహారం బయటకు వచ్చిన సమయంలోనే.. ఏపీ సర్కారు తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్‌చేస్తుందని పేర్కొనటమే కాదు.. 120 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లుగా ఆరోపించటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి దేవినేని ఉమ.. భవానీపురం పోలీస్ స్టేషన్లో ట్యాపింగ్ అంశంపై ఫిర్యాదు చేశారు. దీన్ని కేసుగా నమోదు చేసిన పోలీసులు.. వెంటనే పలు టెలికం సర్వీసుప్రొవైడర్లకు నోటీసులు జారీ చేయటం తెలిసిందే.
విచారణలో బాగంగా వొడాఫోన్.. యూనినార్ ప్రతినిధులు స్వయంగా హాజరు కాగా.. మిగిలిన మరికొందరు తమ ప్రతినిధులను లేదా న్యాయవాదుల్ని పంపినట్లుగా చెబుతున్నారు.
సోమవారం ఉదయం 11 నుంచి విచారణ సా..గుతోంది. వివిధ టెలికాం సర్వీసు ప్రొవైడర్లను అధికారులు గుచ్చి.. గుచ్చి ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. తమ వద్దనున్న సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి.. ఏపీ విచారణ అధికారుల కష్టం ఫలించిందా? ట‌్యాపింగ్‌నకు సంబంధించి అంశాలు బయటకు వచ్చాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది