Begin typing your search above and press return to search.
కొత్త ఆహ్వానం; రాజమండ్రికి కేసీఆర్ వస్తారా?
By: Tupaki Desk | 28 Jun 2015 9:51 AM GMTగతంలో రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండేవి. పార్టీల మధ్య ఉండే విభేదాలు వ్యక్తిగతంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకునే వారు. కానీ.. మారినకాలంతో పాటు.. రాజకీయాలు పూర్తిగా మారిపోయి.. రాజకీయ విభేదాలు వ్యక్తిగత స్థాయికి మించిపోవటం తెలిసిందే.
మిగిలిన రాజకీయ పార్టీల సంగతేమో కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంచాయితీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉప్పు..నిప్పుమాదిరిగా వ్యవహరిస్తూ.. నిత్యం కొట్టుకుంటూ ప్రతి విషయంలోనూ పేచీలు పడే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఎప్పటికి అన్నది రెండు రాష్ఠ్రాల ప్రజలలో పెద్ద ప్రశ్నగా మారింది.
నిత్యం ఏదో ఒక పంచాయితీ తెరపైకి వచ్చే పరిస్థితుల్లో.. అందుకు భిన్నంగా తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. జూలైలో ప్రారంభం అయ్యే గోదావరి పుష్కరాలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించాలని ఏపీ సర్కారు భావించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా గోదావరి పుష్కరాలకు రావాలని ఆహ్వానం పలకాలని నిర్ణయించారు.
రాజకీయంగా ఉండే విభేదాలు పక్కన పెట్టి.. ఇలాంటి పెద్ద కార్యక్రమానికి విభేదాలకు అతీతంగా వ్యవహరించాలని చంద్రబాబు సర్కారు డిసైడ్ చేసిందని చెబుతున్నారు. తన ప్రమాణస్వీకారోత్సవానికి సైతం చంద్రబాబు.. అప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్‌ను ఆహ్వానించటం తెలిసిందే. అయితే.. ఆయన ఆ కార్యక్రమానికి రాలేనని చెప్పటం తెలిసిందే.
మరి.. తాజాగా గోదావరి పుష్కరాలకు ఏపీ సర్కారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే.. ఆయన నుంచి స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య కాలంలో ఓటుకు నోటు వ్యవహారంతోపాటు.. సెక్షన్ 8తో వేడెక్కిపోయిన వాతావరణం.. తాజాగా గోదావరి పుష్కరాలకు ఆహ్వానంతో కాస్తంత సద్దుమణుగుతాయా? అన్నది చూడాలి. ఒకవేళ బాబు సర్కారు ఆహ్వానాన్ని కేసీఆర్ మన్నిస్తే.. రాజమండ్రిలో కేసీఆర్‌ను చూసే ఒక అరుదైన దృశ్యం అవిష్కృతం కావటం ఖాయం.