Begin typing your search above and press return to search.
సీఎం క్యాంపు ఆఫీసులో ఏపీ హైకోర్టు!
By: Tupaki Desk | 2 Jan 2019 1:30 AM GMTకాళ్లు లేనోడు నేను లేస్తేనా? అంటే ఎలా ఉంటుందో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు అలానే ఉంటాయి. తన మాదిరి పని చేసేటోడే లేడని గొప్పలు చెప్పుకునే ఆయన చేతల్లో ఎంత పోటుగాడన్న విషయం తాజాగా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 2024 ప్రణాళిక గురించి మాట్లాడే పెద్ద మనిషి.. 2030లో ఏపీని ఇలా చేయటమే తన లక్ష్యంగా చెప్పుకునే బాబుకు..ఏపీకి హైకోర్టు వచ్చేస్తున్న వేళ.. ఏం చేయాలన్న విషయం పట్టదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ రోజు నుంచి విజయవాడలో ఏపీ హైకోర్టు స్టార్ట్ అవుతున్నా.. ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు తప్పదన్న విషయం 2014లో అధికారంలో వచ్చిన నాటి నుంచి తెలిసిందే. సొంత బిల్డింగ్ తర్వాత.. గౌరవ ప్రదంగా కోర్టు పని కోర్టు చేసుకునేలా.. విశాలంగా.. అన్ని వసతులతో కూడిన కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అదేమీ చేయని గొప్పతనం చంద్రబాబుదే.
కొత్త సంవత్సరం తొలి రోజు నుంచి ఏపీ హైకోర్టు కార్యకలాపాలు విజయవాడలో స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికిప్పుడు హైకోర్టు కోసం భవనం అంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు క్యాంప్ ఆఫీసులో తాత్కాలిక కోర్టు హాళ్లను సిద్ధం చేశారు. రేపటి నుంచి నాలుగో తేదీ వరకూ ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన హాళ్లల్ఓ న్యాయమూర్తులు తమ విధులను నిర్వర్తిస్తారు.
ఈ నెల ఐదో తేదీ నుంచి సంక్రాంతి సెలవులు మొదలు కానున్నాయి. సెలవుల తర్వాత.. నెలాఖరులో అమరావతి పరిధిలోని జ్యూడిషియల్ కాంప్లెక్స్ కు హైకోర్టును తరలిస్తారని చెబుతున్నారు. అప్పటివరకూ ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎనిమిది కోర్టు హాళ్లు.. మరో హాల్ ను ఎంజీ రోడ్డులో ఉన్న ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ముందస్తుగా పక్కా ప్లాన్ తో వ్యవహరించి ఉండి ఉంటే.. ఆఖరి నిమిషంలో ఇలాంటి అడ్జెస్ట్ మెంట్లు ఉండేవి కావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.