Begin typing your search above and press return to search.

ఏపీ సర్కార్ నేడు మరో షాక్..ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత!

By:  Tupaki Desk   |   22 May 2020 11:22 AM GMT
ఏపీ సర్కార్ నేడు మరో షాక్..ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత!
X
ఏపీ ప్రభుత్వానికి నేడు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి - మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ ను హైకోర్టు ఎత్తేసింది. క్యాట్ ఇచ్చిన ఆర్డర్‌ ను పక్కన పెట్టింది. సస్పెన్షన్ చెల్లదని తేల్చి చెప్పింది. వెంకటేశ్వరరావు రిట్ పిటిషన్‌ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే - సస్పెన్షన్ కాలంలో పెండింగ్‌ లో ఉన్న జీతభత్యాలను చెల్లించాలని ఆదేశించింది.

వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారని.. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజీపీ నివేదిక సమర్పించారని.. ఆ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్‌ ను ఆశ్రయంచారు.

తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని - తన 30 ఏళ్ల సర్వీసులో చిన్న ఆరోపణ లేదని.. అవార్డులు కూడా వచ్చాయన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మే 30న తనను బదిలీ చేసి.. 8 నెలలుగా పోస్టింగ్‌ ఇవ్వలేదని.. జీతం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అయితే క్యాట్ కూడా ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ ను క్యాట్ సమర్థించింది.. ఆయన వేసిన ట్రిబ్యునల్ కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.ఏబీ వెంకటేశ్వర్రావు.. 1989 ఏపీ క్యాడర్‌ కు చెందిన ఐపీఎస్ అధికారి. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌ గా పనిచేశారు.