Begin typing your search above and press return to search.
120 ప్రశ్నల్లో 51 తప్పులా.. గ్రూప్ -1 పరీక్ష నిర్వహించడమెందుకు?
By: Tupaki Desk | 28 Jan 2020 10:38 AM GMTగ్రూప్ -1 ...ఎంతోమంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. ఒక్కసారి ఉద్యోగం వస్తే చాలు ..వారి తలరాతలు మారిపోతాయి. అలాగే ఈ గ్రూప్ 1 లో క్వాలిఫై కావడం కూడా అంత సులభం ఏమి కాదు. దీనికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గలపాలి. రాత్రి - పగలు అన్న తేడా లేకుండా పుస్తకాలతో కుస్తీ పట్టాలి ..అయినప్పటికీ కూడా ఈ గ్రూప్స్ లో ర్యాంక్ వస్తుంది మాత్రం చెప్పలేము. కానీ , ఎంతోమంది విద్యార్థులు - నిరుద్యోగులు ఈ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుంటారు.
ఇకపోతే , రాష్ట్రంలో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం 2018 డిసెంబరు 31న ఏపీపీ ఎస్ సీ నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్ష సమయంలో కాలిక్యులేటర్ ను అనుమతిస్తామని నోటిఫికేషన్ లో వెల్లడించనప్పటికీ , కూడా పరీక్ష హాల్ లోకి కాలిక్యులేటర్ ని అనుమతించలేదు. అయితే , ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో 51 తప్పులు దొర్లాయి. దీనిని సవాల్ చేస్తూ అభ్యర్థి షేక్ షానవాజ్ తో పాటు మరో 14 మంది హైకోర్టును ఆశ్రయించగా - ఫలితాల విడుదలపై సింగిల్ బెంచ్ స్టే విధించింది. అయితే ఏపీపీ ఎస్ సీ దీనిని సవాల్ చేయగా మరో సింగిల్ బెంచ్ స్టే వెకేట్ చేసింది. దీంతో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
అయితే, మరోసారి దీన్ని సవాల్ చేస్తూ షేక్ షానవాజ్ బృందం హైకోర్టుని ఆశ్రయించింది. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో హైకోర్టు .. ఏపీపీఎస్ సీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 120 ప్రశ్నల్లో 51 తప్పులా? ఇదేం పరీక్ష? ఇదేం నిర్వహణ? నిపుణులు ఏం చేస్తున్నారు? ఆ ప్రశ్నపత్రాన్ని ఎలా రూపొందించారు... ఎలా అనుమతించారు? ఇన్ని తప్పులతో రూపొందే ప్రశ్నపత్రంతో ఆ గ్రూప్-1 పరీక్ష నిర్వహించడమెందుకు?’ అంటూ నిలదీసింది. అలాగే మరోసారి తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడానికి ఏమైనా సమస్య ఉందా అని , ఏపీపీఎస్ సీ ని హైకోర్టు ఆరా తీసింది. అలాగే ఈ వ్యవహారం పై తదుపరి ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీపీఎస్ సి ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.