Begin typing your search above and press return to search.
ఆ విషయంలో జోక్యం చేసుకోలేము : ఏపీ హైకోర్టు!
By: Tupaki Desk | 7 Aug 2020 12:13 PM GMTఏపీలో 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ సీట్లతో అధికారంలోకి వచ్చింది. కానీ , అసెంబ్లీ లో ఆమోదం పొందిన బిల్లు - మండలిలో కూడా ఆమోదం పొందాల్సి రావడం అక్కడ టీడీపీ స్పష్టమైన మెజారిటీ ఉండటం తో మండలి విషయంలో టీడీపీ - వైసీపీ మధ్య వైసీపీ అధికారం చేపట్టిన సమయం నుండి జరుగుతూనే ఉంది. కానీ , మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసుకొని ..మండలికి పంపితే అక్కడ ప్రతిపక్షం ఆ బిల్లుని అడ్డుకుంది. ఆ బిల్లుపై వ్యవహారమే చివరికి మండలిని రద్దు చేయాలనే కీలక నిర్ణయం తీసుకునే వరకు వెళ్ళింది. అనుకున్నదే తడువుగా వైసీపీ సర్కార్ ..మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. మండలి రద్దు అంశం ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉంది.
ఇదే సమయంలో మండలిని రద్దు చేయాలని అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై తాజాగా గురువారం హైకోర్టు విచారించింది. దీనిపై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. శాసనమండలి రద్దు పై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, దీనిపై న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వలేదని, ఈ రిట్ లో తాము ఎలా జోక్యం చేసుకోగలమని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు పిటిషనర్ తరపు లాయర్ ఉన్నం మురళీధర్ రావు స్పందిస్తూ .. పలు ప్రజాహిత ప్రయోజన అంశాలున్నందున విచారణ చేయాలని కోర్టుని కోరారు. దీంతో, దీనిపై విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.