Begin typing your search above and press return to search.
చంద్రబాబు దెబ్బకు పరారే.. పరారే..
By: Tupaki Desk | 17 April 2016 10:20 AM GMTఉన్న ఊరిలో పని దొరక్క ఇతర ప్రాంతాలకు కూలీలు వలసలు పోవడం చూశాం. కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారులు వలసలు పోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేక ఎపిలో పని చేస్తున్న ఐఎఎస్ - ఐపిఎస్‌లు కేంద్ర సర్వీసులకు, కాదంటే వేరే రాష్ట్రాల కేడర్లకు మూకుమ్మడిగా వలస బాట పడుతున్నారట. తాము చెప్పినవారికి పనులు చేసిపెట్టాలంటూ ఒత్తిళ్లు... వేధింపులు - ఫలితాలపై కంటే ప్రచార లక్ష్యంతో ముఖ్యమంత్రి, మంత్రులు నిర్వహిస్తున్న వీడియో - టెలీ కాన్ఫరెన్స్ లు సమీక్షా సమావేశాల బాధలు తట్టుకోలేక ముఖ్య కార్యదర్శి - ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాల నుంచి సబ్ కలెక్టర్ స్థాయి వరకు ఐఎఎస్ లు... అదనపు డిజిపిల నుంచి ఎస్పీల వరకు ఐపిఎస్ లు విసిగి వేసారి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. కేంద్ర సర్వీసులకు వెళ్లే అవకాశం లేకపోతే కనీసం డిప్యూటేషన్ పై వేరే రాష్ట్రాలకు పంపాలని, అదీ కుదరకపోతే కనీసం తాము ఇప్పుడున్న స్థానం నుంచి బదిలీ అయినా చేయాలని పలువురు మొర పెట్టుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే అదనపు డిజిపి స్థాయి ఐపిఎస్ అధికారి విఎస్ కె కౌముది సర్కారుపై అసంతృప్తితో దరఖాస్తు పెట్టుకొని మరీ ఇటీవల కేంద్ర సర్వీసులకు వెళ్లారు. దీంతో బ్యూరోక్రాట్లలో వలస బాట పట్టేవారి సంఖ్య పెరిగిందని అర్థమవుతోంది.
కాగా కేంద్ర సర్వీసులుకు దరఖాస్తు చేసుకున్న కౌముదిని రాష్ట్రంలో సరిగా ఉపయోగించుకోలేదన్న విమర్శలున్నాయి. సమర్ధతను గుర్తించకుండా సర్కారీ పెద్దల అడుగులకు మడుగులొత్తే కొంత మంది అధికారులకు మంచి పోస్టింగ్ లిచ్చి అందలం ఎక్కిస్తుండటంతో విసిగిపోయిన కౌముది సెంట్రల్ సర్వీసులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఆయన సిఆర్ పిఎఫ్ లో పోస్టింగ్ అడగ్గా - ట్రాక్ రికార్డును గమనించిన కేంద్రం ఉగ్రవాద చర్యలపై ప్రత్యే కంగా దర్యాప్తు చేసే ప్రసిద్ధ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐఎ)లో కీలక స్థానం ఇచ్చి గౌరవించిందని ఐపిఎస్ వర్గాలు చెబుతున్నాయి.
సీఎం - మంత్రులే కాకుండా టిడిపికి చెందిన ఎంపీలు - ఎమ్మెల్యేలు - అమాత్యుల పుత్రరత్నాలు - చివరికి జన్మభూమి కమిటీ సభ్యులు కూడా తమ పనులు చేసి పెట్టాలని ఐఏఎస్ - ఐపిఎస్ లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారట. ఉత్తరకోస్తాలో ఒక సీనియర్ పోలీస్ అధికారిపై అమాత్యుడొకరు తమ వారికి పనులు చేసి పెట్టాలని ఇబ్బంది పెడుతుండటంతో తాళలేక తానున్న స్థానం నుంచి బదిలీ చేయాలని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఐఎఎస్ లు కూడా ప్రభుత్వంపై అసంతృప్తితో కేంద్ర సర్వీసులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. సిఎం - మంత్రులు సమయం సందర్భం లేకుండా నిర్వహిస్తున్న సమావేశాలు - టెలీ - వీడియో కాన్ఫరెన్స్ లు ఇబ్బందికరంగా మారాయని పలువురు అధికారులు ఆందోళన చెందుతున్నారు. దానికితోడు 'పనులు' చేసి పెట్టాలన్న ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సీనియర్ ఐఎఎస్ ల్లో ఏకంగా 18 మంది సెంట్రల్ సర్వీసులకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ వేధింపులతో మానసిక వేదన - శరీర అలసటకు తోడు తమ కుటుంబాలకు దూరమవుతున్నామని చాలామంది ఫీలవుతున్నారు.
అయితే... నిబంధనల మేరకు రాష్ట్రాల్లో పని చేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారులను ప్రతి ఏడాదీ పరిమిత సంఖ్యలో కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటారు. ఆ పరిమితిని దాటి పెద్ద సంఖ్యలో ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు వలస వెళ్లాలని ప్రయత్నిస్తుండడంతో ఎవరికి ఆ అదృష్టం దొరుకుతుందో చూడాలి. మొత్తానికి సెంట్రల్ జైలు లాంటి ఏపీ నుంచి సెంట్రల్ సర్వీసులకు వెళ్లాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు.