Begin typing your search above and press return to search.
ఏపీ ఎమ్మెల్యేకు కరోనా..మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది?
By: Tupaki Desk | 23 Jun 2020 8:30 AM GMTఏపీలోని ఎస్.కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు తాజాగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఆయన అమెరికా పర్యటన నుంచి వచ్చాడని సమాచారం. కరోనా పాజిటివ్ కన్ఫమ్ కావడంతో ఐసోలేషన్ లోకి వెళ్లాడు. అయితే కరోనా అంటు వ్యాధి.. ఒకరి నుంచి మరొకరికి ఈజీగా సోకుతుంది. ముట్టుకుంటే అంటుకునే ఈ వ్యాధి ఈ ఎమ్మెల్యే కారణంగా ఎంతమందికి సోకిందనే భయం ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది.
ఎస్.కోట ఎమ్మెల్యే కరోనా పాజిటివ్ గా తేలడానికి ముందుగా తాజాగా మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో అసెంబ్లీకి వచ్చి మరీ ఓటేశాడు. అసెంబ్లీలో జరిగిన రెండు రోజుల మాక్ పోలింగ్ లో పాల్గొన్నాడు. చాలామందిని కలిశాడు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ఈయనతో చేతులు కూడా కలుపుకున్నారు అని వినికిడి.
అసెంబ్లీ ఆవరణలో సోషల్ డిస్టేన్స్ లేకుండా కలుపుగోలుగా తిరిగారు. మరి ఎస్.కోట ఎమ్మెల్యే వల్ల వైసీపీకి చెందిన ఎంతమందికి కరోనా సోకి ఉంటుందనే భయం ఇప్పుడు ఆయనను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలను పట్టిపీడిస్తోంది. ఎస్.కోట ఎమ్మెల్యేకు కరోనా అని తెలియగానే ఆయనను కలిసిన వారంతా క్వారంటైన్ వెళ్లారని తెలిసింది. ఇప్పుడు సదురు ఎమ్మెల్యేలను కలిసిన వారు కూడా ఆందోళన చెందుతున్నారట.. ఇలా ఒక్క ఎమ్మెల్యేతో ఎంతమంది ఎమ్మెల్యేలకు వారి అనుచరులకు కరోనా వ్యాపించిందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు.