Begin typing your search above and press return to search.
ఆంధ్రాను బాగు చేసుకునే ఆలోచన లేదా?
By: Tupaki Desk | 26 Jun 2015 4:14 AM GMTఎవరు ఎన్ని చెప్పినా రాష్ట్రం విడిపోయింది. సెక్షన్ 8 కానీ.. మరొకటి కానీ తాత్కలికమే తప్పించి.. హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానిదే. దాని విషయంలో తెలంగాణ సర్కారుకే హక్కులన్నీ. ఉమ్మడి రాజధాని హోదాలో పదేళ్లు ఏదోలా బండి లాగించేందుకు వీలు కల్పించారు.
విడిపోయిన ప్రాంతంలోని ఒక మహానగరంలో వాటాను వెతుక్కునే కన్నా.. తమ ఆధీనంలోని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన చాలా ముఖ్యం. విభజన జరిగి 13 నెలలు కావొస్తోంది. ఇదేమీ స్వల్ప వ్యవధి ఏమీ కాదు. ఈ సమయంలో.. ఏపీలో ప్రభుత్వం స్థిరపడేందుకు.. పాలన అక్కడ నుంచి సాగించేందుకు అవసరమైన ఏర్పాట్ల మీద దృష్టి పెడితే ఎలా ఉండేది..?
ఈ రోజు కాకున్నా.. రేపటి రోజునైనా హైదరాబాద్ అనే అద్దె ఇంటిని (విభజన చట్టం ప్రకారం ఆదాయంలో పైసా ఇవ్వకున్నా.. విద్యుత్తు.. తాగునీటి ఛార్జీలు.. నిర్వహణ ఖర్చులు ఏపీ సర్కారు తాను వాడుకునే భవనాలకు సంబంధించి చెల్లించాల్సి ఉంటుంది) విడిచిపెట్టి వెళ్లాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే సీమాంధ్ర అభివృద్ధికి హైదరాబాద్ ఆటంకం అన్న విషయాన్ని మర్చిపోకూడదు.
నిద్ర లేచిన దగ్గర నుంచి ఏపీ సర్కారు కానీ.. ఉన్నతాధికారులు కానీ.. ప్రజాప్రతినిధులు కానీ హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంటే.. ఏపీ ఎప్పటికి అభివృద్ధి చెందుతుంది? నిజమే.. ఇప్పటికిప్పుడు ఏపీకి వెళితే కష్టాలు ఉంటాయి. మరీ మాట చెబుతున్న వారు గడిచిన 13 నెలల్లో ఏం చేసినట్లు? ఏదైనా అనుకోని పరిస్థితి ఏర్పడి ఏపీకి తరలిపోవాలంటే ఏం చేయాలి? దానికి ఎలాంటి సన్నద్ధతతో ఉండాలన్న విషయంపై బాబు అండ్ కో చేసిందేమిటి? అని ఆలోచిస్తే పెద్ద గుండు సున్నా కనిపిస్తుంది తప్పించి మరొకటి ఉండదు.
రాజధాని నిర్మాణం అనేది సుదీర్ఘకాలం పాటు సాగే ప్రక్రియ. ఐదేళ్లలోనో.. పదేళ్లలోనో ముగిసిపోయే ఘట్టం కాదు. అలాంటప్పుడు.. పాలనా సౌకర్యాలకు అనుగుణంగా ఏర్పాట్లు ఎందుకు చేసుకోవటం లేదు? అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగిస్తే.. ఈ రోజున భారీ భవనాలు నిర్మించటానికి నెలల్లోనే పూర్తి చేయొచ్చు. అలాంటప్పుడు తన పాలనను.. తాత్కలిక రాజధానిలోనో.. రాజధానిగా భావిస్తున్న అమరావతికి దగ్గర్లోనో ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది కదా.
ఇలాంటి నిర్మాణాత్మక ఆలోచనలు మర్చిపోయి.. హైదరాబాద్‌లో మా ఇష్టం వచ్చినట్లు ఉంటామని ఒకరు.. పదేళ్లు కాదు... వందేళ్లు అయినా మేం హైదరాబాద్‌లోనే ఉంటాం.. ఏం చేసుకుంటారో చేసుకోండని మరికొందరు తెలుగు తమ్ముళ్లు చేసే వాదనలు చూసినప్పుడు.. అధికారం ఇచ్చిన ఆంధ్రా ప్రజల గురించి కన్నా.. హైదరాబాద్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది.
విభజన జరిగిపోయింది.. హైదరాబాద్ ఆంధ్రులకు కాకుండా పోయిందన్నది వాస్తవాన్ని గ్రహించి.. తన ప్రాంతం అభివృద్ధి గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకానీ.. పోయిన చోట వెతుక్కోవాలన్న సామెతెను.. విభజన విషయంలోనూ.. హైదరాబాద్ విషయంలోనూ అప్లై చేయాలని చూస్తే ఆవేశాలు.. ఆయాసాలు తప్పించి మరే విధంగానూ వర్క్‌వుట్ కాదన్న విషయాన్ని ఏపీ అధికారపక్షం ఎంత తొందరగా గ్రహిస్తే.. సీమాంధ్రులకు అంత మేలు చేసిన వారు అవుతారు.