Begin typing your search above and press return to search.

కేసీఆర్ చేసిన ప‌నికి ఆంధ్రా నాయ‌కులు ఫిదా !

By:  Tupaki Desk   |   4 March 2022 9:30 AM GMT
కేసీఆర్ చేసిన ప‌నికి ఆంధ్రా నాయ‌కులు ఫిదా !
X
ప్రాంతం కాని ప్రాంతంకు చెందిన సైనికులకు సైతం చేయూత అందించేందుకు కేసీఆర్ చొరవ చూపుతున్నారు.అంతేకాదు రైతు పోరాటంలోఅశువులు బాసిన వారికీ సాయం అందించేందుకు సిద్ధం అవుతున్నారు అని స‌మాచారం. ఈ రెండు ప‌నులూ కేసీఆర్ పై ఆంధ్రా నాయ‌కులు ప్రేమ పెంచుకునేందుకు కార‌ణం అవుతున్నాయి.

ఇవాళ జార్ఖండ్ లో కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు.దీంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న దేశ వ్యాప్తంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ముఖ్యంగా గాల్వ‌న్ లోయ‌లలో చైనా జ‌రిపిన దాడిలో అమ‌రులయిన ఇద్ద‌రు జ‌వానుల కుటుంబాల‌కు అండ‌గా నిలిచేందుకు కేసీఆర్ నిర్ణ‌యించ‌డం గొప్ప విష‌యం అని అంతా కితాబులు ఇస్తున్నారు. త‌మ రాష్ట్రం కాక‌పోయినా దేశంకోసం అశువులు బాసిన అమ‌రుల కుటుంబాల‌కు చెరో ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున అందించి, వారిని ప‌రామర్శించి త‌న త‌ర‌ఫున భ‌రోసా అందించ‌ను న్నారు.

దీంతో కేసీఆర్ పేరు ఆంధ్రాలో కూడా మారుమ్రోగిపోతోంది.ఆయ‌న రాష్ట్రం కాని రాష్ట్రానికి వెళ్లి సాయం చేసి రావ‌డాన్ని అంతా అభినందిస్తున్నారు.ఇదే స్ఫూర్తితో దేశా వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులూ ప‌నిచేయాల‌ని అంటున్నారు.గ‌తంలో ఇదే దాడిలో చ‌నిపోయిన క‌ల్న‌ల్ సంతోష్ కుమార్ కుటుంబాన్ని వెనువెంట‌నే ఆదుకున్న ఘ‌న‌త కూడా ఆయ‌న‌దే అని విప‌క్షాలు సైతం కేసీఆర్ ను కొనియాడేంత‌గా ప‌నిచేశారు. స్పందించారు.ఆ కుటుంబానికి టీఆర్ఎస్ ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటుంద‌ని అన్నారు.

మ‌రోవైపు గాల్వ‌న్ వ్యాలీలో ఇదే ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారికి దేశం యావ‌త్తూ నివాళుల‌ర్పించింది. కానీ కేసీఆర్ అంత వేగంగా ఆంధ్రా స‌ర్కారు స్పందించ‌లేక‌పోయింది.శ్రీ‌కాకుళంకు చెందిన లావేటి ఉమామ‌హేశ్వ‌ర‌రావు విష‌య‌మై జ‌గ‌న్ వెనువెంట‌నే స్పందించ‌లేక‌పోయారని ఇదే సంద‌ర్భంలో ప‌లువురు ఆంధ్రా నేత‌లు,ముఖ్యంగా టీడీపీ,జ‌న‌సేన నాయ‌కులు గుర్తు చేసుకుంటున్నారు.దేశ రాజ‌కీయాల్లో రాణించాల‌న్న త‌లంపే కాదు దేశాన్ని కాపాడే శ‌క్తుల‌కు అండ‌గా ఉండాల్సిన బాధ్య‌త కూడా అంద‌రి నాయ‌కుల‌దీ అని కేసీఆర్ మ‌రోమారు గుర్తు చేస్తున్నార‌ని టీడీపీ,జన‌సేన మ‌రోమారు కేసీఆర్ చొర‌వ‌ను ప్ర‌శంసిస్తున్నాయి.